మరోసారి భారత్ పెద్ద మనుసు
న్యూఢిల్లీ: భారత్ మరోసారి తన పెద్ద మనసును చాటుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకునే విపత్తులకు సహాయం అందించే ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి విరాళాన్ని ప్రకటించింది. 2015-16 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి అత్యవసర సేవల విభాగమైన సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ (సీఈఆర్ఎఫ్)కు ఐదు లక్షల డాలర్లను(రూ.34కోట్లు) విరాళంగా అందించనుంది.
ఇంతే మొత్తాన్ని 2014 సంవత్సరానికి కూడా ప్రకటించింది. 'మావనత దృక్పథంతో స్పందించాల్సిన అంశాల్లో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ముందునుంచే ప్రపంచ దేశాల్లో తలెత్తిన విపత్తులకు భారత్ సహాయం చేస్తూనే ఉంది' అని భారత్ తరుపున ఐక్యరాజ్య సమితి సేవల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింగ్ తెలిపారు.