కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలి
Published Tue, Aug 9 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
హన్మకొండ : ఉద్యోగులకు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాÄæూస్ అసోషియేషన్ జిల్లా శాఖ డి మాండ్ చేసింది. సోమవారం హన్మకొండలో జరిగిన జిల్లా శాఖ సమావేశంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసేల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమ కార్యాచరణను రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.లింగమూర్తి వెల్లడించారు. ఈ నెల 10న ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలి. 11న అన్ని మండలాల్లో తహసీల్దార్‌లను కలిసి వినతిపత్రాలు అందజేయాలి. 16న ఆర్డీఓలకు వినతిపత్రం అందజేత, 22న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత, సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరా పా ర్కు వద్ద ధర్నా చేయనున్నట్లు వివరించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎస్.కుమారస్వామి, మనోహర్, శ్రీనివాస్‌రావు, బుచ్చన్న, వి.రాంబాబు పాల్గొన్నారు.
Advertisement