Pensanars
-
అందుబాటులోకి ‘వెల్నెస్’
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు, జర్నలిస్టులకు ఉచితంగా వైద్య ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బురుజు దగ్గర్లో గల పాత మాతా శిశుసంరక్షణ (ఎంసీహెచ్) సేవలు అందించే భవనంలో వెల్నెస్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని శనివారం (నేడు) జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించనున్నారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే విషయాన్ని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావ్ వారం రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని ఏంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై త్వరలోనే వెల్నెస్ సేవలు అందుబాటులోకి వస్తాయని గుర్తు చేసిన విషయం విదితమే. సిద్దిపేటకమాన్ (సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను జారీ చేసింది. ఈ ఆరోగ్య కార్డులున్న వారితోపాటు వారి కుటుంబానికి అవసరమైన వైద్యసేవలు ఉచితంగా అందిస్తుంది. ఒక కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచితంగా సేవలందిస్తారు. పరిమితి దాటితే ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఆరోగ్య కార్డులు ఉన్న వారు వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లి రావాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో వీరికి ఇబ్బందులు తప్పనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఐదు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య కార్డులున్న వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. ఏడాది కిందటే మంజూరు సంవత్సరం కిందటే సిద్దిపేటకు వెల్నెస్ సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడం, జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా నూతనంగా 300 పడకల ఆస్పత్రిని నిర్మించడంతో సిద్దిపేటలోని ఏంసీహెచ్ విభాగాన్ని నూతన జిల్లా ఆస్పత్రి భవనంలోకి తరలించడం జరిగింది. దీంతో పాత ఎంసీహెచ్ భవనం ఖాళీ అయ్యింది. దీంతో పాత ఎంసీహెచ్ భవనంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పుర్తి చేశారు. సుమారు రూ. పది లక్షల వ్యయంతో అన్ని వసతులను ఏర్పాటు చేసి సెంటర్ ప్రారంభానికి సిద్ధం చేశారు. వెల్నెస్ సెంటర్లో ఓపీ సేవలతో పాటు, జనరల్ సర్జరీ, ఆప్థాల్మిక్ సేవలు, దంత వైద్యం, గైనకాలజీ సేవలు అందించనున్నారు. ఇక్కడ వైద్య సేవలకు అవసరమైన యంత్ర పరికరాలు, మందులు, సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని వసతుల ఏర్పాటు.. వెల్నెస్ కేంద్రంలోని భవనంలో ఓపీ సేవల కోసం గదులు, ఈసీజీ, ఎక్స్‌రే, దంత పరీక్షలు, డయాగ్నస్టిక్ పరీక్షల కోసం గదులను ఏర్పాటు చేశారు. ఇందుకు కావాల్సిన యంత్ర పరికరాలు, ఫర్నీచర్, సిబ్బందిని సిద్దం చేశారు. కార్పొరేటు ఆస్పత్రులకు దీటుగా ఇక్కడ వైద్య సేవలు అందనున్నాయి. ఇప్పటికే ఒక వైద్యుడితో పాటు సెంటర్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. వెల్నెస్ సెంటర్‌ను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, వెల్నెస్ సెంటర్ సిబ్బంది పాల్గొంటారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జర్నలిస్టులు, ఉద్యోగుల సంక్షేమం కోసం.. జిల్లాలోని జర్నలిస్టులు ప్రతి నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వారి సంక్షేమం కోసం జిల్లాలోని జర్నలిస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ, ఉచితంగా మందులను అందివ్వడానికి దోహదపడుతుంది. జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయం. ఈ వెల్నెస్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావ్ -
కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలి
హన్మకొండ : ఉద్యోగులకు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాÄæూస్ అసోషియేషన్ జిల్లా శాఖ డి మాండ్ చేసింది. సోమవారం హన్మకొండలో జరిగిన జిల్లా శాఖ సమావేశంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసేల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమ కార్యాచరణను రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.లింగమూర్తి వెల్లడించారు. ఈ నెల 10న ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలి. 11న అన్ని మండలాల్లో తహసీల్దార్లను కలిసి వినతిపత్రాలు అందజేయాలి. 16న ఆర్డీఓలకు వినతిపత్రం అందజేత, 22న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత, సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరా పా ర్కు వద్ద ధర్నా చేయనున్నట్లు వివరించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎస్.కుమారస్వామి, మనోహర్, శ్రీనివాస్‌రావు, బుచ్చన్న, వి.రాంబాబు పాల్గొన్నారు. -
ఆర్థిక ఆసరా..
నేడు పెన్షనర్స్ డే కొరిటెపాడు (గుంటూరు) : తలపండిన అనుభవం.. తలపడే ఉత్సాహం.. అనుభవాల పరవళ్లు.. అనుబంధాల సందళ్లు ఒకేచోట కావాలంటే అది కేవలం పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఇంట్లోనే కనిపిస్తాయి. జీవితాంతం ఎన్నో కష్టాలు పడి ముదిమి వయస్సులో మనుమలు, మనవరాళ్లతో ఆనందంగా గడిపే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్‌పైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఒక వ్యక్తి ఉద్యోగపరంగా సేవలు అందించి.. ఉద్యోగ విరమణ తర్వాత అతను అందుకునే జీవనాధారమే ఇది. అందుకే ఈ పెన్షన్ సేవలకు ప్రభుత్వం కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు కల్పించింది. ఇందులో భాగంగానే 1871వ సంవత్సరంలో దేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ చట్టాన్ని తెచ్చారు.ఈ చట్టం జారీ అయిన డిసెంబర్ 17వ తేదీనే పెన్షనర్స్ డేగా జరుపుకొంటున్నారు. పెన్షనర్ల పెద్ద మనసు నేటి పెన్షనర్లు అసోసియేషన్లుగా ఏర్పడి సమాజ సేవలో పాల్గొంటున్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పదుల సంఖ్యలో పెన్షనర్ల అసోసియేషన్లు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, పాఠశాలల్లో మౌలిక వసతులు, మురికివాడల ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వంటివి చేస్తున్నారు. అయితే, పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఆర్థికపరమైన భద్రత కల్పించడంతో పాటు వారు చేపట్టే సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. కంట్రిబ్యూషన్ పెన్షన్ విచారకరం పెన్షన్ అనేది కేవలం ఉద్యోగి చేసిన సేవకు చెల్లించే జీవనాధారమే కాదు. వయోభారంతో రోజురోజుకూ కుంగిపోవడమే కాకుండా శారీరక, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని కల్పిస్తున్న ఆర్థిక, భద్రతా చర్య. అయితే, నాటి పాలకులు భవిష్యత్తుకు భరోసా ఇస్తే నేటి పాలకులు కంట్రిబ్యూటర్ పెన్షన్ తేవడం ద్వారా భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి పదేళ్లు అయినా దానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం నిర్ణయించలేని అయోమయ స్థితిలో ఉందన్నారు. ఇది విచారకరం. పెన్షన్ మంజూరులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలి. - ఈదర వీరయ్య, పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షుడు నేడు వయోవృద్ధులకు సన్మానం విజయవాడ (పటమట) : పెన్షనర్స్ డేను పురస్కరించుకుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75ఏళ్లు దాటిన 14మంది వయోవృద్ధులను సన్మానిస్తున్నట్లు అసోసియేషన్ నగర కార్యదర్శి కేఎస్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరురోడ్డులోని ఆర్అండ్బీ కార్యాలయ ఆవరణలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 1980వ సంవత్సరంలో పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలపై డీఎస్ నగారా అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసి గెలిచారని, అప్పటి నుంచి పెన్షనర్లు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు. పెన్షనర్స్ డే రోజున ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆల్ఫ్రెడ్, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొంటారని ఆయన వివరించారు. ముదిమి వయస్సులో జీవనాధారం స్వాతంత్య్రానంతరం పౌరసేవలను విస్తృత పరచిన క్రమంలో పెన్షన్ చట్టానికి మరింత స్పష్టత వచ్చింది. దీనిని సామాజిక భద్రతకు సంబంధించిన అంశంగా భావించి.. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ప్రజలకు అందించిన అమూల్య సేవలకు గుర్తింపుగా పొందుతున్న అత్య వసర జీవనాధారంగా దీనిని పరిగణించింది. నేటి పాలకులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి పెన్షనర్ల భవితను అంధకారంలోకి నెట్టారు.