తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది.
మహబూబ్నగర్ : తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 97 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 1632 అడుగులుకు ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,66,706 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1,89254 క్యూసెక్కులు ఉంది. సుంకేశుల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 0.33 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 289 అడుగులకు ఉంది.
మరోవైపు తుంగభద్రలోకి ఒకేసారి 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో రాజోలి సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వరకు బ్యాక్ వాటర్ చేరుకున్నాయి. దీంతో పాత గ్రామంలోని మాలగేరి, ఎస్సీ కాలనీ, మార్లబీడు ప్రజలు భయాందోళనకు గురయ్యారు.