సుంకేసుల కళకళ
సుంకేసుల కళకళ
Published Thu, Jul 28 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
గూడూరు:
సుంకేసుల రిజర్వాయర్ నీటితో కళకళలాడుతోంది. మూడు రోజులుగా రిజర్వాయర్ ఎగువన కుండపోతగా వర్షాలు పడుతుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉదయం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాం అధికారులు ఆరు గంటల సమయంలో రెండు గేట్లను మీటర్ మేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కులకు చేరడంతో మరో 2 గేట్లను మీటర్ మేర ఎత్తి మొత్తం నాలుగు గేట్ల ద్వారా 18 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు మళ్లించారు. కేసీ కాల్వకు 2300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డ్యాం వర్క ఇన్‌స్పెక్టర్ మునిస్వామి పేర్కొన్నారు.
Advertisement
Advertisement