మెరుగు పడుతున్న కౌలాస్ నాలా నీటి మట్టం
జుక్కల్ : జుక్కల్ మండలంలో కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నీటి మట్టం పెరిగింది. ఎగువ భాగం నుంచి ఇన్‌ఫ్లో రావడంతో నీటి మట్టం 454 మీటర్ల నుంచి 454.9 మీటర్లకు చేరినట్లు ప్రాజెక్ట్ జెఈ గజానన్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ప్రాంతంతో 5 సెం.మీ వర్షపాతం నమోదు కాగా జుక్కల్ మండలంలోని ఇతర ప్రాంతాలలో 8 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు పేర్కొన్నారు. ఎగువ భాగం నుంచి 80 క్యూసెక్కుల వరద వస్తోందని తెలిపారు. మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలలో కురిసిన వర్షానికి ప్రాజెక్ట్‌లో నీరు వచ్చి చేరుతోందన్నారు.