జూరాలకు... ఇన్‌ఫ్లో నిల్
కర్ణాటక నుంచి జూరాల రిజర్వాయర్‌కు వచ్చే ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. శనివారం నుంచి ఇన్‌ఫ్లో నిల్‌గా నమోదవుతోంది. రిజర్వాయర్‌లో ఉన్న 4 టీఎంసీల నీటిని ఏప్రిల్ 15వరకు ఆయకట్టుకు అందించాలని, ఆతర్వాత రిజర్వాయర్‌లో ఉన్న నీటిని బట్టి తగు నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మరోసారి జూరాల ఆయకట్టు రైతులకు నీటి సమస్య పెద్ద నష్టాన్నే మిగిల్చేలా మారింది. ఈ ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వల ద్వారా దాదాపు 70వేల ఎకరాల్లో రైతులు వరి పంటలను సాగు చేసుకున్నారు.
ఇప్పటికే పంట కాలం సగం పూర్తి కాగా, మే మొదటి వారం వరకు కాల్వల ద్వారా నీళ్లందిస్తేనే పంట పూర్తవుతుంది. లేని పక్షంలో రూ.కోట్ల విలువైన పంట నీళ్లందక ఎండిపోయి రైతులను నిలువునా నష్ట పర్చే పరిస్థితి పొంచి ఉంది. గత మూడేళ్లుగా జూరాల ఆయకట్టు పరిధిలో రైతులు రబీ సీజన్‌లో నీళ్లందక పంటలు ఎండి నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి రాకుండా వరి పంటలు సాగు చేసుకోవద్దని డిసెంబర్ మొదటి వారంలో జరిగిన ఐఏబీలో ప్రకటనలు చేశారు. జనవరి మొదటి వారం వరకు ప్రకటనలకే అధికారులు పరిమితమై ఆయకట్టు పరిధిలోని గ్రామాల్లో వరి సాగు చేయకుండా రైతులను చైతన్యం చేయడంలో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
జనవరి ఆఖరి వారంలో కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో అప్రమత్తమై వరి సాగు చేయొ ద్దని గ్రామాల్లో దండోరా వేయించడం, రైతులకు స్థానిక సిబ్బంది ద్వారా ప్రచారం చేయించినా ఉపయోగం లేకుండా పోయిం ది. అప్పటికే వరిమళ్లు సిద్ధమై 70వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు ఉపక్రమించా రు. పంటలను పూర్తి చేసేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రిజర్వాయర్‌లో నీ ళ్లుంటేనే ఉపయోగం. ఇప్పటికైనా అధికారులు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని పంట లకు వార బందీ పద్దతిలో మరికొన్నాళ్లు అందించేందుకు ప్రయత్నిస్తే న ష్టాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ 15న నీటి నిల్వను బట్టి నిర్ణయం - ఎస్‌ఈ ఖగేందర్
ఏప్రిల్ 15 వరకు కాల్వల ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తాం. అప్పటి వరకు మిగిలి ఉన్న నీటి నిల్వ ఎంతుంది, ఏం చేయాలి, తాగునీటి పథకాలకు నీటి అవసరాలను ృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల అనుమతితో నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ఏప్రిల్ 15 తర్వాత నీటి విడుదల కొనసాగింపుపై ఏమి చెప్పలేమని జూరాల ఎస్‌ఈ ఖగేందర్ చెప్పారు.