jurala reservoir
-
నేడు జూరాలకు కృష్ణమ్మ
సాక్షి, అమరావతి: ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ కదలి వస్తోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 56,905 క్యూసెక్కులు చేరుతుండటంతో.. విద్యుత్ కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను సోమవారం దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి 43,616 క్యూసెక్కులు చేరుతుండటం.. నీటి నిల్వ 34.87 టీఎంసీలకు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి 27,574 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి విడుదల చేసిన జలాలు మంగళవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరనున్నాయి. 15 రోజుల ముందే శ్రీశైలానికి.. ► వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టులోకి 6,032 క్యూసెక్కులు చేరుతుండగా.. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750, భీమా ఎత్తిపోతల ద్వారా 650, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 151 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. ► ప్రస్తుతం జూరాలలో 8.38 క్యూసెక్కులు నిల్వ ఉన్నాయి. జూరాల నిండాలంటే మరో 1.27 టీఎంసీలు అవసరం. ► జూరాల నుంచి జలాలను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ జలాలు బుధవారం శ్రీశైలం జలాశయానికి చేరనున్నాయి. ► గతేడాది జూలై 30న శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం రాగా.. ఈ ఏడాది పక్షం రోజుల ముందే ఎగువ నుంచి వరద నీరు చేరనుండటం గమనార్హం. తుంగభద్ర, గోదావరిలో తగ్గిన ప్రవాహం ► తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది. టీబీ డ్యామ్‌లోకి 17,550 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.8 టీఎంసీలకు చేరింది. టీబీ డ్యామ్ నిండాలంటే 79 టీఎంసీలు అవసరం. ► పులిచింతలకు దిగువన కృష్ణా బేసిన్లో కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీలోకి 13,485 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 6,416 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 7,069 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ► గోదావరిలో వరద ప్రవాహం కూడా క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 96,842 క్యూసెక్కులు వస్తుండగా.. 2,100 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేసి.. మిగిలిన 94,762 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 71.601 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ► గొట్టా బ్యారేజీలోకి వంశధార నది నుంచి 3,499 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 3,205 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ 8.073 టీఎంసీల వంశధార జలాలు కడలి పాలయ్యాయి. -
జూరాలకు బిరబిరా
సాక్షి, హైదరాబాద్ : ఎగువన గత పదిహేను రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కర్ణాటకలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. గతేడాదితో పోలిస్తే నెలన్నర ముందుగానే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రలు నిండటంతో జూరాల వైపు కృష్ణమ్మ ఉరకలేస్తూ వస్తోంది. నారాయణపూర్ నుంచే 1.46 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం ఏ క్షణంలో అయినా ఆ ప్రవాహాలు జూరాలను చేరనున్నాయి. 10 టీఎంసీలకు మించి వరద వచ్చే అవకాశం ఉండటంతో గురువారం సాయంత్రానికే జూరాల గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి నీటి విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బుధవారం సాయంత్రమే తుంగభద్ర 12 గేట్లు ఎత్తడంతో అక్కడ్నుంచి కూడా శ్రీశైలానికి భారీ వరద రానుంది. ప్రాజెక్టులన్నీ నింపేస్తూ.. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ఉరకలేస్తోంది. రెండ్రోజుల కిందట ఇక్కడ ఏకంగా 35 సెం.మీ. వర్షం కురవగా.. బుధవారం 15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తోపాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో దిగువ కర్ణాటకకు ఉధృతంగా ప్రవాహాలు వస్తున్నాయి. ఈ ప్రవాహాలకు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో ఆల్మట్టి డ్యామ్‌లోకి బుధవారం సాయంత్రానికి 1.53 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ప్రాజెక్టులో ఇప్పటికే 129 టీఎంసీల నిల్వలకు గానూ 113.4 టీఎంసీల నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువ నారాయణపూర్‌కు వదులుతున్నారు. ఇప్పటికే నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు 33 టీఎంసీలు ఉండటంతో 1.46 లక్షల క్యూసెక్కుల నీటిని జూరాలకు వదులుతున్నారు. 10 టీఎంసీల మేర వరద వస్తుండటం, ఇప్పటికే ఈ ప్రాజెక్టుల్లో 5.73 టీఎంసీల నీరు ఉండటంతో గురువారం రాత్రి జూరాల గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. మరోవైపు తుంగభద్ర కూడా నిండుకుండను తలపిస్తోంది. ఇక్కడ 100 టీఎంసీలకుగాను 91.59 టీఎంసీల నిల్వ ఉంది. 70 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో బుధవారం సాయంత్రం తుంగభద్ర గేట్లు ఎత్తారు. దీంతో 65 వేల క్యూసెక్కుల మేర వరద శ్రీశైలం దిశగా వస్తోంది. అక్కడ్నుంచి శ్రీశైలానికి నీరు చేరేందుకు ఒకటిన్నర రోజు పడుతుందని, ఈ లెక్కన శుక్రవారం సాయంత్రానికి వరద వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో తెలంగాణను కేంద్ర జల సంఘం అప్రమత్తం చేసింది. మరో 15 రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉన్నందున వరద నియంత్రణ చర్యలు తీసుకోవాలని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల అధికారులకు సూచించింది. ఇక ఇప్పటికే జూరాల పరిధిలోని నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ పంపులను ఆరంభించగా.. శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తి ద్వారా కూడా నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
జూరాల.. విలవిల
పాలమూరు జిల్లాకు అతిపెద్ద ఆదరువు జూరాల జలాశయం అడుగంటిపోయింది. డెడ్‌స్టోరేజీ 4.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే నిల్వఉన్నాయి. ఇప్పటికే గద్వాల, రామన్‌పాడు తాగునీటి పథకాలకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపేశారు. -‘సాక్షి’, మహబూబ్‌నగర్ -
కరువు నేల.. కళకళ!
- వరప్రదాయినిగా మారనున్న ‘పాలమూరు ఎత్తిపోతల’ - ఐదు ఎత్తిపోతల స్టేజీలను మూడింటికి కుదింపు - ప్రాజెక్టు పూర్తయితే 7లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం - ప్రస్తుత ప్రాజెక్టులతో 9.72లక్షల ఎకరాలకు సాగునీరు గద్వాల: పాలమూరు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం జూరాల రిజర్వాయర్ నుంచి ఐదు దశల్లో ఎత్తిపోతల ద్వారా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. దీని ఆధారంగా గత ప్రభుత్వం సర్వేకు అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గత రెండు నెలల క్రితం ప్రాథమిక సర్వేచేయడానికి జూరాల అధికారులను ఆదేశించింది. జూరాల ఇంజనీరింగ్ అధికారులు ప్రాథమిక సర్వేను ఇవ్వడంతో సమగ్ర సర్వేకు గతనెలలో ప్రభుత్వం రూ.5.71 కోట్ల అంచనా వ్యయంతో అనుమతించింది. ఈ మేరకు సర్వే సంస్థ ప్రాథమిక నమూనాను సిద్ధంచేసి అధికారులకు అందజేసింది. ఈ ప్రకారం గతంలో ఉన్న ఐదు ఎత్తిపోతల స్టేజీలను కుదించి కేవలం మూడుచోట్ల మాత్రమే ఎత్తిపోతల ద్వారా మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా నమూనా రూపొందిం చారు. జూరాల రిజర్వాయర్ నుంచి మొదటి లిఫ్టు ద్వారా కోయిల్‌సాగర్ వరకు, రెండోలిఫ్టు కోయిల్‌సాగర్ నుంచి రంగారెడ్డి జిల్లా గండ్వీడ్ రిజర్వాయర్ వరకు పంపింగ్ చేస్తారు. మూడోలిఫ్టు గండ్వీడ్ రిజర్వాయర్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ వరకు పంపింగ్ చేస్తారు. కొత్త డిజైన్ ద్వారా ప్రభుత్వానికి అంచనా వ్యయం తగ్గడంతో పాటు త్వరగా పనులు పూర్తయి విద్యుత్ వ్యయం కూడా తగ్గుతుంది. పాడిపంటలకు నెలవుగా అడ్డంకులు తొలగి పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే జిల్లా పరిస్థితి మారిపోనుంది. జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడంతో ఎటుచూసినా పచ్చని పొలాల కళకళలాడనుంది. ఇప్పటికే సాగునీరందిస్తున్న ఆర్డీఎస్ ద్వారా 85వేల ఎకరాలు, జూరాల ప్రాజెక్టు ద్వారా 1.07లక్షల ఎకరాల ఆయకట్టుతో గద్వాల, అలంపూర్, మక్తల్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని మండలాల్లో పచ్చని పైర్లు కనిపిస్తున్నాయి. సాగునీరందేది ఇలా... జలయజ్ఞం ద్వారా నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో రెండులక్షల ఎకరాలు, భీమా ప్రాజెక్టు పరిధిలో మరో రెండులక్షల ఎకరాలు, కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో 3.30లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పరిధిలో సుమారు 50వేల ఎకరాలు.. ఇలా మొత్తం 16.72 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మరో రెండు నుంచి మూడేళ్లలో కొత్త, పాత ప్రాజెక్టులతో జిల్లాలో 80శాతం సాగుభూములు మాగాణి భూములుగా మారే అవకాశం ఉంది. సాగునీటి వనరులు పెరగడంతో ఇప్పటికే పాడిపరిశ్రమలో ముందున్న పాలమూరు జిల్లా మరింత అభివృద్ధి పథంలో నడిచే అవకాశం కలుగుతుంది. ఈ భారీప్రాజెక్టుపై జిల్లారైతాంగం కోటిఆశలతో ఉంది. కొత్త డిజైన్‌తో పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వే సంస్థ తయారు చేసిన కొత్త నమూనాతో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, వనపర్తి, షాదనగర్, జడ్చర్ల నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించేవిధంగా రూపొందించారు. మనజిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు, నల్గొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుండడంతో పాటు హైదరాబాద్ మహానగరానికి కృష్ణానది జలాలను తాగునీటి అవసరాల కోసం అందించాలన్న అంశాన్ని కూడా చేర్చారు. ఈ విధంగా సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను పాలమూరు ఎత్తిపోతల పథకం తీర్చనుంది. -
పాలమూరు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
జూరాల-పాకాల, పాలమూరు పథకాల వేగం పెంచాలని ఆదేశం గద్వాల: జిల్లాలోని భారీనీటి పారుదల ప్రాజెక్టు, జూరాల రిజర్వాయర్ ఆధారంగా మూడు జిల్లాలో సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టదలచిన పథకాల వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జూరాల-పాకాల ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టాలని నిర్ణయించిందని, ఈ బడ్జెట్లోనే రెండు ప్రాజెక్టులకు నిధులను కేటాయించనున్నామని ఇందుకోసం వెంటనే సర్వే పనులను చేపట్టాలన్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండు భారీ సాగునీటి ప్రాజెక్టులకు త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ప్రాజెక్టుల కేంద్రంగా ఉన్న జూరాల ప్రాజెక్టు మరో రెండు సాగునీటి ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సాగు, తాగునీటికి అందించే ప్రాజెక్టుగా మారబోతుంది. తెలంగాణకు వరదాయిగా జూరాల... పశ్చిమ కనుమల్లో ప్రారంభమై మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే కృష్ణానదిపై పాలమూరు జిల్లాలో నిర్మితమైన జూరాల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే వరదాయినిగా మారబోతుంది. జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఆరు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సుమారు 25లక్షల ఎకరాలకు సాగునీటినందించే ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీనికితోడు పాలమూరు జిల్లాలో ముఖ్యమైన పట్టణాలకు తాగునీటినందించే పథకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటికితోడు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్‌ను అందిస్తూనే, థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి జూరాల రిజర్వాయర్ కీలకం కాబోతుంది. అలాగే జూరాల ప్రాజెక్టు పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టు, భీమా ఎత్తిపోతల పథకం ద్వార ప్రాజెక్టు పరిధిలో 2లక్షల ఎకరాాల ఆయకట్టు నీళ్లు అందుతాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించనున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పరిధిలో 30 వేల ఎకరాల ఆయకట్టు, పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలో మూడు జిల్లాలు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలలో 10లక్షల ఎకరాల ఆయకట్టు నీళ్లు అందించాలన్నది లక్ష్యం. -
‘జూరాల’లో నలుగురి మునక
ఒకరి మృతదేహం లభ్యం లభించని ముగ్గురి ఆచూకీ ధరూరు, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్‌లో నలుగురు మునిగి పోయారు. స్థానికులు, బాధితులు కథనం మేరకు.. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన కుటుంబం గద్వాలలోని శేరెల్లివీధికి చెందిన మహిమూదా ఇంటికి శనివారం వచ్చింది. రాత్రి గద్వాలలోనే ఉండి ఆదివారం ఉదయం ఆత్మకూరులోని బంధువులను చూసేందుకు జీపులో వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గద్వాలకు తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని జూరాల ప్రాజెక్టును చూసి అక్కడే కొద్దిసేపు గడిపి వెళ్దామని ఆగారు. వేసవి కావడం, ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గి ఉండడంతో వారు కుడికాల్వకు నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీళ్లలో ఆడుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన షాకీర్ (17) మునిగిపోయాడు. గమనించిన తోటివారు సాబేర్ (20), మోసిన్ (19)తో పాటు గద్వాల పట్టణానికి చెందిన వారి బంధువుల అబ్బాయి సమీర్ (19) షాకీర్‌ను కాపాడబోయి ఒకరివెంట మరొకరు ఐదుగురూ నీటిలో మునిగిపోయారు. జుబేర్‌ను జాలర్లు కాపాడారు. రిజర్వాయర్‌లో ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో పాటు యువకులకు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. ఆదివారం రాత్రి వరకు షాకీర్ ఒక్కరి మృతదే హమే లభించింది. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు.. జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, న్యూస్‌లైన్: నీళ్లలోకి దిగి గల్లంతైన యువకుల ఉదం తం స్థానికంగా విషాదం నింపింది. బోరబండ సైట్-1కి చెందిన మహమ్మద్ కుమారులు సాబేర్, షాకిర్ పదో తరగతి పూర్తి చేశారు. షాకిర్ అమీర్‌పేటలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తుండగా, సాబేర్ ఇంటి దగ్గరే ఉంటూ చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబానికి సహాయపడుతున్నాడు. అదే ప్రాంతంలో ఉండే వీరి సమీప బంధువు మోసిన్ (19) కూడా చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో ఉండే పెదనాన్న ఇంటికి వెళ్లారు. ఆదివారం ఈత కొట్టడానికని సమీపంలోని జూరాల ప్రాజెక్టుకు వెళ్లి గల్లంతయ్యారు. వీరి తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన గద్వాల బయలుదేరి వెళ్లారు. -
జూరాలకు... ఇన్‌ఫ్లో నిల్
కర్ణాటక నుంచి జూరాల రిజర్వాయర్‌కు వచ్చే ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. శనివారం నుంచి ఇన్‌ఫ్లో నిల్‌గా నమోదవుతోంది. రిజర్వాయర్‌లో ఉన్న 4 టీఎంసీల నీటిని ఏప్రిల్ 15వరకు ఆయకట్టుకు అందించాలని, ఆతర్వాత రిజర్వాయర్‌లో ఉన్న నీటిని బట్టి తగు నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మరోసారి జూరాల ఆయకట్టు రైతులకు నీటి సమస్య పెద్ద నష్టాన్నే మిగిల్చేలా మారింది. ఈ ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వల ద్వారా దాదాపు 70వేల ఎకరాల్లో రైతులు వరి పంటలను సాగు చేసుకున్నారు. ఇప్పటికే పంట కాలం సగం పూర్తి కాగా, మే మొదటి వారం వరకు కాల్వల ద్వారా నీళ్లందిస్తేనే పంట పూర్తవుతుంది. లేని పక్షంలో రూ.కోట్ల విలువైన పంట నీళ్లందక ఎండిపోయి రైతులను నిలువునా నష్ట పర్చే పరిస్థితి పొంచి ఉంది. గత మూడేళ్లుగా జూరాల ఆయకట్టు పరిధిలో రైతులు రబీ సీజన్లో నీళ్లందక పంటలు ఎండి నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి రాకుండా వరి పంటలు సాగు చేసుకోవద్దని డిసెంబర్ మొదటి వారంలో జరిగిన ఐఏబీలో ప్రకటనలు చేశారు. జనవరి మొదటి వారం వరకు ప్రకటనలకే అధికారులు పరిమితమై ఆయకట్టు పరిధిలోని గ్రామాల్లో వరి సాగు చేయకుండా రైతులను చైతన్యం చేయడంలో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. జనవరి ఆఖరి వారంలో కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో అప్రమత్తమై వరి సాగు చేయొ ద్దని గ్రామాల్లో దండోరా వేయించడం, రైతులకు స్థానిక సిబ్బంది ద్వారా ప్రచారం చేయించినా ఉపయోగం లేకుండా పోయిం ది. అప్పటికే వరిమళ్లు సిద్ధమై 70వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు ఉపక్రమించా రు. పంటలను పూర్తి చేసేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రిజర్వాయర్‌లో నీ ళ్లుంటేనే ఉపయోగం. ఇప్పటికైనా అధికారులు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని పంట లకు వార బందీ పద్దతిలో మరికొన్నాళ్లు అందించేందుకు ప్రయత్నిస్తే న ష్టాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 15న నీటి నిల్వను బట్టి నిర్ణయం - ఎస్ఈ ఖగేందర్ ఏప్రిల్ 15 వరకు కాల్వల ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తాం. అప్పటి వరకు మిగిలి ఉన్న నీటి నిల్వ ఎంతుంది, ఏం చేయాలి, తాగునీటి పథకాలకు నీటి అవసరాలను ృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల అనుమతితో నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ఏప్రిల్ 15 తర్వాత నీటి విడుదల కొనసాగింపుపై ఏమి చెప్పలేమని జూరాల ఎస్ఈ ఖగేందర్ చెప్పారు.