శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో పెరుగుతోంది.
శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో పెరుగుతోంది. సోమవారం 16వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మంగళవారం సాయంత్రం సమయానికి 35,645 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.
జూరాల నుంచి 13వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 22,395 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 53.2754 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 833.50 అడుగులుగా నమోదైంది.