ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
Published Wed, Aug 3 2016 8:15 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 25 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1077.60(46.20 టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
ప్రారంభమైన విద్యుదుత్పత్తి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ దిగువ భాగన ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్క టర్బయిన్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. 9 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్‌కో అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement