- 47071 క్యూసెక్కులు దిగువకు విడుదల
- ఆరు యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.
ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుం చి వస్తున్న ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు కొనసాగుతున్నట్లు పీజేపీ అ ధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 36488 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లకు విద్యుదుత్పత్తి నిమిత్తం 46071 క్యూసెక్కులు, ఆయకట్టు రైతులకు సాగునీటి నిమిత్తం కుడి, ఎడమ కాలువల ద్వారా వేయి క్యూసెక్కులను మొత్తం ప్రాజెక్టు నుంచి 47071 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు.
ఆదివారం రాత్రి 7.30గంటల వరకు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 1043 అడుగులుగా ఉంది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1613 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 52029 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 11 క్రస్టుగేట్లను మీటరు ఎత్తుకు ఎత్తి 69670 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 47400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 5 క్రస్టుగేట్లను మీటరు ఎత్తుకు ఎత్తి 66500 క్యూసెక్కుల నీటిని దిగువకు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జూరాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
Published Mon, Sep 8 2014 1:47 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement