కేతేపల్లి, న్యూస్‌లైన్: మూసీ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి ఆదివారం కూడా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. అధికారులు నాలుగు క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ ఎగువ, పరిసర ప్రాంతా ల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శనివారం 1,30,000 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో ఆదివారం నాటికి 26 వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో శుక్రవారం తెరిచి ఉంచిన 11 క్రస్టు గేట్లలో ఏడింటిని మూసి వేశారు. 4 క్రస్టు గేట్లను ఐదు అడుగు మేర ఎత్తి ఉంచి 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు మూసీకి వదులుతున్నారు. శనివారం 11 క్రస్టు గేట్లు తెరిచి ఉంచటంతో 645 అడుగుల గరిష్ట నీటిమట్టం 642 అడుగులకు త గ్గింది. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 300 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. నీటిమట్టం 644.5 చేరుకున్న తర్వాత ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే మరి కొన్ని గేట్లు ఎత్తుతామని ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.