
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
కరీంనగర్: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. 20 టీఎంసీల సామర్ధ్యంగల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 18.5 టీఎంసీల నీరు ఉంది. అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 93 వేల342 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 62 వేల 881 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.