పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం
బాల్కొండ : శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లోకి గడ్డెన్నవాగు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు(90టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1064.10 అడుగుల(18.85 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.