సోమశిలో 37.247 టీఎంసీల నీరు
సోమశిల : సోమశిల జలాశయంలో బుధవారం 37.247 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 1,737 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 93.491 మీటర్లు 306.73 అడుగుల మట్టం నమోదైంది. సగటున 151 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.