రాష్ట్రంలో ఈ రోజు రెండు వేరువేరు ప్రాంతాలలో నీట మునిగి ముగ్గురు మృతి చెందారు. మరో మగ్గురు గల్లంతయ్యారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రోజు రెండు వేరువేరు ప్రాంతాలలో నీట మునిగి ముగ్గురు మృతి చెందారు. మరో మగ్గురు గల్లంతయ్యారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం కాలువలో పడి బెంగళూరుకు చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. వారు ముగ్గురూ బెంగళూరు వాసులుగా గుర్తించారు.
వరంగల్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురంలో చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు. ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.