Rangapuram
-
వృద్ధురాలి ఆత్మహత్య
మొగుళ్లపల్లి : మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన బల్గూరి సుగుణమ్మ(75) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీ సుల కథనం ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన బ ల్గూరి సుగుణమ్మ గత మూడేళ్లుగా క్యానర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె సో మవారం క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కు టుంబ సభ్యులు అస్పత్రికి తీసుకవెళ్లగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. -
దశలవారీగా బీబీనగర్ నిమ్స్ అభివృద్ధి
త్వరలో 300 పడకల ఆస్పత్రిగా మారుస్తాం కాంట్రాక్టర్‌తో తలెత్తిన సమస్యల కారణంగా వైద్య సేవల ప్రారంభంలో జాప్యం నిమ్స్ భవనాన్ని పరిశీలించిన రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి బీబీనగర్ : మండలంలోని రంగాపురం పరిధిలో గల నిమ్స్ యూనివర్సిటీని దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన బెంగళూరు నుంచి నేరుగా బీబీనగర్ చేరుకుని నిమ్స్ భవనాన్ని మొదటి పేజీ తరువాయిపరి శీలించారు. ఇందు లో వసతులు, చేపట్టాల్సిన నిర్మాణాపై నిమ్స్ వైద్యులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే 300 పడకల ఆస్పత్రిగా మార్చి వైద్య కళాశాలను అందుబాటులోకి తేస్తామని చెప్పారు. బెంగళూరులోని జైదేవా ఆస్పత్రిని పరిశీలించామని ఆ తరహాలో దీనిని తీర్చిదిద్దుతామన్నారు. నిమ్స్ భవన నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్‌తో తలెత్తిన సమస్యల కారణంగానే జాప్యం జరగడంతో ఇన్ని రోజలుగా నిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభంకాలేకపోయాయన్నారు. ఓపీ సేవలు ప్రారంభించనున్నందున రోగులకు ఎలాంటి ఇబ్బందులు కగలకుండా ఉండేందుకు వైద్యాధికారు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 169 మంది సిబ్బందితో ఓపీ విభాగం నిమ్స్‌లోని ఓపీ విభాగాన్ని 169మంది సిబ్బందితో ప్రారంభించనున్నట్లు నిమ్స్ డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి తెలిపారు. సిబ్బంది కోసం కొత్తగా ఎలాంటి రిక్రూట్మెంట్లు జరపలేదని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో గల వైద్యులను, పారా మెడికల్, సిబ్బందిని ఇక్కడ నియమిస్తామన్నారు. ఓపీలోని వైద్య సేవలను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిస్తామని, పరిస్థితులను బట్టి సమయాన్ని పొడిగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, నిమ్స్ వైద్యులు మహేష్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, ఉప సర్పంచ్ అక్బర్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, నరహరి, అంజయ్యగౌడ్, బాల్‌రాజుగౌడ్, అమరేంధర్ తదితరులు పాల్గొన్నారు. -
దారుణహత్య, తల.. మొండెం విడివిడిగా లభ్యం
-
దారుణహత్య, తల.. మొండెం విడివిడిగా లభ్యం
మంచాల: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మంచాల మండలం రంగాపురం సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలో వ్యక్తి మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు వ్యక్తి మొండెం మాత్రమే కనిపించింది. దీంతో పరిసరాల్లో గాలింపు చేపట్టి వ్యక్తి తలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు జిల్లాలోని యాచారం మండలం నర్సక్క మేడిపల్లికి చెందిన కిరణ్ గా గుర్తించారు. కిరణ్ ను హత్య చేసి తల, మొండెం వేరు చేశారా లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేప్టటారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నీటమునిగి ముగ్గురి మృతి : మరో ముగ్గురి గల్లంతు
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రోజు రెండు వేరువేరు ప్రాంతాలలో నీట మునిగి ముగ్గురు మృతి చెందారు. మరో మగ్గురు గల్లంతయ్యారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం కాలువలో పడి బెంగళూరుకు చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. వారు ముగ్గురూ బెంగళూరు వాసులుగా గుర్తించారు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురంలో చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు. ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.