సోమశిలో 29.41 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 29.417 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 7,897 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 500 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 91.440 మీటర్లు, 300 అడుగుల నీటి మట్టం ఉంది. సగటున 126 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వథావుతోంది.