సోమశిలలో 40.450 టీఎంసీలు
సోమశిల:
సోమశిల జలాశయంలో బుధవారం సాయంత్రానికి 40.450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3360 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 3500 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 94.275 మీటర్లు, 309.30 అడుగు మట్టం నమోదైంది. సగటున 149 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.