
గౌతమ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ ప్రదేశ్‌గా కాదు.. చెత్తాంధ్ర ప్రదేశ్‌గా మారుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జీవో 279 వెంటనే రద్దు చెయ్యాలనే కార్మికుల డిమాండ్‌పై చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందని అన్నారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయినా బాబు తీరు మారదా అని వ్యాఖ్యానించారు.
సమస్యను విన్నవిస్తే తప్పా..?
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతియేడు డీఎస్సీ నోటిఫికేషన్ వేశారని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రికి బేరం కుదరలేదు కాబట్టే డీఎస్సీని మళ్లీ వాయిదా వేశారని ఆరోపించారు. ఆశ వర్కర్లను ప్రభుత్వం చులకన గా చూస్తోందని ధ్వజమెత్తారు. కార్మికులకి కనీస వేతనం పదివేల రూపాయల ఇవ్వాలనే తమకు సమస్యను లేవనెత్తడం నేరమా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. తమ సమస్య పరిష్కారానికి మద్దతు కోరుతూ ప్రతిపక్ష నాయకుడు వద్దకు వెళ్లిన ఉద్యోగులను సస్పెండ్ చెయ్యటం దారుణమని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment