సాక్షి, విజయవాడ: అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'సీఎం జగన్ సచివాలయ ఉద్యోగుల పక్షపాతి. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల ద్వారా వచ్చింది. సీఎం రాష్ట్రంలోని కార్మిక వర్గానికి పెద్దపీట వేశారు.
అక్టోబర్ 2నాటికి గ్రామ సచివాలయాలు ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా సచివాలయ ఉద్యోగులు ప్లకార్డులు పట్టుకొని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా సంవత్సరం దాటిన తర్వాత ప్రొవిషనల్ టెస్ట్ ఉంటుందని.. అదే విధంగానే సచివాలయ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని' గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment