ప్రత్యామ్నాయం చూపండి : ఎమ్మెల్యే
ప్రత్యామ్నాయం చూపండి : ఎమ్మెల్యే
Published Tue, Aug 2 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ఆత్మకూరురూరల్ : ఏఎస్‌పేట దర్గా వద్ద రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించనున్న దుకాణదారులకు ప్రత్యామ్నాయం చూపాలని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ వెంకటరమణను కోరారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆర్డీఓతో సమావేశమయ్యారు. దుకాణదారులకుS కొంతసమయం ఇవ్వాలని గౌతమ్‌రెడ్డి కోరారు. ఆర్డీఓ మాట్లాడుతూ తొలగించనున్న దుకాణదారుల కోసం సమీపంలోని పంచాయతీ స్థలంలో కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత తీసుకున్న కంపసముద్రం గ్రామంలో ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులను త్వరగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంట మల్లు సుధాకర్‌రెడ్డి, ఏఎస్‌పేట నాయకులు వీజీఆర్ సుబ్బారెడ్డి, బోయిళ్ల చెంచురెడ్డి, నంది హజరత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి ఉన్నారు.
ç
Advertisement
Advertisement