Athamakur
-
మాజీ మంత్రి ఎదుట వాదులాట
ఆత్మకూరురూరల్ : మున్సిపాలిటీ పరిధిలో గత 20 రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోందని పట్టణ ప్రజలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం మండలంలోని చెర్లోయడవల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వద్ద దీనిపై రెండువర్గాలు చిన్నపాటి వాదులాటకు దిగాయి. కలుషిత నీటి వ్యవహారాన్ని ఆనం దష్టికి ఆయన అనుచరులు తీసుకెళ్లారు. మున్సిపల్ పాలకవర్గం సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ రాగి వనమ్మ ఆనంతో భేటీ అయ్యేందుకు అక్కడికి వచ్చారు. దీంతో ఆమె సమస్యలుంటే తన దష్టికి తేవచ్చు కదా అనడంతో కొద్దిసేపు ఆనం అనుచరులు, చైర్పర్సన్ వాదులాడుకున్నారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య, చల్లారవి తదితరులు దీనిపై అందరం ఒకచోట కూర్చొని చర్చించుకుందాం అనడంతో ఆనం కలుగజేసుకొని ఎక్కడో ఎందుకు నెలాఖరులో ‘అధికారికంగా’ మున్సిపల్ కార్యాలయంలో కూర్చుని మాట్లాడుకుందాం అనడంతో సమస్య సద్దుమణిగింది. ఆనం మాటలను బట్టి ఆయన అనుచరులు ఈనెల 15వ తేదీ తర్వాత ఇన్చార్జి మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు. -
మద్యం మత్తులో పెదనాన్నపై దాడి
చికిత్స పొందుతూ వద్ధుడి మతి ఆత్మకూరురూరల్ : మద్యం మత్తులో పెదనాన్నపై దాడికి పాల్పడటంతో చికిత్స పొందుతూ అతను మతి చెందిన ఘటన మండలంలోని అప్పారావుపాళెం దళితకాలనీలో ఆదివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మెడబల్లి నరసయ్య (65) ప్రతి రోజూ తన ఇంటికి సమీపంలోని అరుగు వద్ద మంచంపై నిద్రిస్తుండే వాడు. శుక్రవారం రాత్రి నరసయ్య తమ్ముడి కొడుకు మెడబల్లి నరసింహబాబు మద్యం మత్తులో ఆ మంచంపై పడుకున్నాడు. నిద్రపోయేందుకు మంచం వద్దకు వచ్చిన నరసయ్య పడుకుని ఉన్న నరసింహబాబును చూసి తన చేతికర్రతో తట్టి లేపాడు. దీంతో ఆగ్రహంతో అతను అదే కర్రతో నరసయ్యను తీవ్రంగా కొట్టాడు. గొడవ జరుగుతుందని బయటకు వచ్చిన నరసయ్య భార్య అడ్డుకోబోయింది. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో గాయపడిన భర్తను తీసుకుని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. శనివారం వైద్యం చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం మరురోజు నెల్లూరుకు తీసుకువెళ్లాలని, అదే రాత్రి గ్రామానికి చేరుకున్నారు. అయితే ఆదివారం తెల్లవారు జామున నరసయ్య పరిస్థితి విషమించడంతో మతి చెందాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ ఎస్కే ఖాజావళి, ఎస్ఐ ఎం.పూర్ణచంద్రరావు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేశారు. పెద్దనాన్నపై దాడికి పాల్పడిన నరసింహబాబును బంధువులు ఓ గదిలో బంధించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు నరసింహబాబు ఆరోగ్యం సరిలేక తీవ్ర స్థాయిలో మూర్ఛ (ఫిట్స్) రావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కాగా గతంలోనే ఇతనిపై రెండు కేసులు ఉన్నాయని, మరో 15 రోజుల్లో వివాహం జరగనుండటం గమనార్హం. మతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రత్యామ్నాయం చూపండి : ఎమ్మెల్యే
ఆత్మకూరురూరల్ : ఏఎస్‌పేట దర్గా వద్ద రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించనున్న దుకాణదారులకు ప్రత్యామ్నాయం చూపాలని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ వెంకటరమణను కోరారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆర్డీఓతో సమావేశమయ్యారు. దుకాణదారులకుS కొంతసమయం ఇవ్వాలని గౌతమ్‌రెడ్డి కోరారు. ఆర్డీఓ మాట్లాడుతూ తొలగించనున్న దుకాణదారుల కోసం సమీపంలోని పంచాయతీ స్థలంలో కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత తీసుకున్న కంపసముద్రం గ్రామంలో ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులను త్వరగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంట మల్లు సుధాకర్‌రెడ్డి, ఏఎస్‌పేట నాయకులు వీజీఆర్ సుబ్బారెడ్డి, బోయిళ్ల చెంచురెడ్డి, నంది హజరత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి ఉన్నారు. ç -
రెండేళ్ల కష్టం.. మూడురోజుల్లో నయం
ఆత్మకూరురూరల్ : కార్పొరేట్ ఆస్పత్రుల్లో నయం జబ్బును ప్రభుత్వాస్పత్రి వైద్యులు నయంచేశారు. వివరాలు.. కలువాయి మండలం తోపుగుంట గ్రామానికి చెందిన అన్నెపోగు సుబ్బరత్నమ్మ రెండేళ్లుగా కాళ్లు, చేతుల నొప్పులతో బాధపడుతుండేది. స్థానిక ఆస్పత్రులతో పాటు నెల్లూరులో కార్పొరేట్ వైద్యశాలలో చూపించుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన రత్నమ్మ దిగులుపడి నాలుగురోజుల క్రితం అపస్మారక స్థితికి వెళ్లిన ఆమెను బంధువులు ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. డాక్టర్ ఎన్.విజయభాస్కర్‌రెడ్డి ఆమె రోగాన్ని పరిశీలించారు. సాధారణంగా ప్రతి మనిషికి 3.5 నుంచి 5 ఎంఈక్యూ (మిల్లీ ఈక్వలెంట్) పొటాషియం లెవెల్స్ ఉండాలని, ఆమెకు కేవలం ఒక ఎంఈక్యూ మాత్రమే ఉందని నిర్ధారించి మందులు ఇచ్చి మూడురోజుల్లోనే జబ్బును తగ్గించారు. -
ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు
ఆత్మకూరురూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జి.లక్ష్మీపతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.పుల్లయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని డాక్టర్ చెర్లో రమణారెడ్డి భవన్లో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల వ్యవసాయ కార్మికుల జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా తయారయ్యాయన్నారు. పేద ప్రజలు, వ్యవసాయ కార్మికుల కోసం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నాయన్నారు. వ్యవసాయంలో కీలకమైన కూలీలకు కనీసవేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందడం లేదని ఆరోపించారు. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శిలుగా గొరిపర్తి పెంచలయ్య, కార్యదర్శిగా ముత్యాల పెంచలయ్య, కమిటీ సభ్యులుగా పి.పెంచల రామయ్య, టి.రవి, పి.వెంకటయ్య, జి.రమణమ్మ, కత్తి ఎల్లయ్యలను నియమించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు ఎం.నాగేంద్ర, కేవీపీఎస్ నాయకులు కె.డేవిడ్‌రాజు, మహిళా సంఘం నాయకులు షేక్ గుల్జార్‌బేగం పాల్గొన్నారు. -
నిరుద్యోగ సమస్యపై యువత ఉద్యమించాలి
ఆత్మకూరురూరల్ : నిరుద్యోగ సమస్యపై యువత ఉద్యమించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడతా ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆత్మకూరులోని చెర్లో రమణారెడ్డి భవన్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. 14 వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం 4,500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ను విడుదల చేశారని, ఇందులోనూ అనేక సమస్యలున్నాయన్నారు. ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కానిస్టేబుల్ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. గ్రూప్–1, 2 పోస్టుల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పాలకులు యువతను మోసం చేస్తున్నారన్నారు. జిల్లాలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈనెల 14వ తేదీన జిల్లా మహాసభ జరుగుతుందని, ఇందులో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. -
నిత్యం ట్రాఫిక్‌జామే
కల్వర్టు నిర్మాణపనులతో వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు పట్టణంలోకి వచ్చే ప్రధానరహదారిపై ఎల్‌ఆర్‌పల్లి ప్రాంతం వద్ద కల్వర్టు నిర్మాణపనులు కొనసా...గుతుండటంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు రెండునెలలుగా ఈ పరిస్థితి ఉంది. గత నెల 5వ తేదీన రహదారులు, భవనాలశాఖ అధికారులు నూతన కల్వర్టు నిర్మాణం కోసం పాత కల్వర్టును తొలగించారు. అయితే సాంకేతిక సమస్యలు, కొందరు ఇళ్ల యజమానులు కోర్టుకెళ్లిన నేపథ్యంలో నూతన నిర్మాణం నిలిచిపోయింది. గత 20 రోజుల క్రితం నిర్మాణ æపనులు చేపట్టినా అవి ఇంకా పూర్తికాలేదు. దీంతో పట్టణంలోకి రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ బస్సులకు రహదారి లేకపోవడంతో అవి డిపోకే పరిమితమయ్యాయి. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 100 పడకల ఆస్పత్రి సైతం కల్వర్టు అవతల ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. 21 రోజుల్లో కల్వర్టు నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పిన అధికారులు సకాలంలో పనులు పూర్తిచేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇరుకుగా ఉండే ప్రత్యామ్నాయ రోడ్డులో ప్రతి అరగంటకోమారు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌జామ్ అవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
ఈదురు గాలుల విధ్వంసం
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : పట్టణంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ మోస్తరు వర్షంతో పాటు ఈదురు గాలుల బీభత్సానికి ఆత్మకూరు విధ్వంసం అయింది. ఒక్కసారిగా సుడిగాలి లేచి పది నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పైకప్పులు, హోర్డింగ్‌లు నేలకూలాయి. ఆర్టీసీ డిపోలో ఓ దుకాణంపై చెట్లు విరిగి పడిపోయాయి. సమీపంలోని కల్వర్టు వద్ద మరో చెట్టు విరిగి రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జ్యోతినగర్ సమీపంలో విద్యుత్ తీగలతో పాటు డిష్ తీగలు తెడిపడిపోయాయి. సమీపంలోనే గణేష్ విగ్రహాలు తయా రు చేసే శిల్పుల గుడారాలు సైతం నేలమట్టమయ్యా యి. నాగులపాడు వెళ్లే రహదారిలో హోర్డింగ్‌లు, విద్యు త్ స్తంభాలు ధ్వంసమై నేలకొరిగాయి. ఆసుపత్రి ఆవరణలో ఇనుప కమ్ములు ఎగిరిపడ్డాయి. పోలీసుస్టేషన్ ఆవరణలో ఓ చెట్టు విరిగి పోలీసు జీపుపై పడడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎల్‌ఆర్‌పల్లిలో చెట్లు కూలడంతో పాటు ఇళ్ల ప్రహరీలు నేలమట్టమయ్యాయి. చెరువుకట్ట సమీపంలో చెట్టు కూలి విద్యుత్ స్తంభం విరిగిపడింది. విద్యుత్ శాఖ, ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద చెట్లు నేలకూలాయి. సోమశిల రోడ్ సెంటర్లో కొయ్యల మిల్లు పైకప్పు కూలిపోయింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారంతో జనజీవనం స్తంభించింది. పట్టణ సమీపంలోని పొలాల్లో పని చేసుకునేవారు వర్షం, గాలికి చెట్టు కిందకు వెళ్లడంతో చెట్టు కూలి పలువురు గాయపడ్డారు. విద్యుత్ స్తంభం, వైర్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అసలే విద్యుత్ కోతలతో సతమతమవుతుండగా, విద్యుత్ తీగలు, స్తంభాలు తెగిపడడంతో విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందోననే ఆందోళన నెలకొంది. అరటి, మామిడి చెట్లు నేలమట్టం వీర్లగుడిపాడులో రూ.50 లక్షలకు పైగా నష్టం సంగం : ఈదురు గాలులు అన్నదాతలను అతలాకుతలం చేసింది. మంగళవారం ఒక్కసారిగా మారిన వాతావరణంతో సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామానికి చెందిన కాటంరెడ్డి జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితర రైతులకు చెందిన పది ఎకరాలకుపైగా అరటి తోటలు ఈదురుగాలులకు నేలమట్టం అయ్యాయి. మరో 40 ఎకరాల్లో మామిడి చెట్లు నేలకూలాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కంట తడిపెట్టారు. అరటి చెట్లు కూలడంతో అరటి గెలలు విరిగిపోయాయి. సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షంతో పాటు సుడిగాలి ఒక్కసారిగా గ్రామాన్ని చుట్టడంతో పెన్నానది తీరాన ఉన్న ఆకు తోటలు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
ఘనంగా సుబ్రమణ్యస్వామికి పూజలు
ఆత్మకూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆ దివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారం సందర్భంగా అర్చకులు సు బ్రమణ్యస్వామి, మంజునాథస్వామి, పా ర్వతీదేవిలను పట్టువస్త్రాలు, ఆభరణాలు పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీకమాసం సందర్భంగా పలు ప్రాం తాల నుచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుబ్రమణ్య స్వాములును దర్శిం చుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు తులసి పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామినామం స్మరి స్తూ పూజలు చేశారు. భక్తులు మధ్యాహ్నం మహా మంగళ హారతిని దర్శిచుకున్నారు. వేలాదిగా భక్తులు తరలిరావడం తో భక్తులతో ఆలయం కిక్కిరిసింది. భక్తులకు అన్నదానం నిర్వహించారు.