మద్యం మత్తులో పెదనాన్నపై దాడి | attack on old man | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పెదనాన్నపై దాడి

Published Mon, Aug 8 2016 12:14 AM | Last Updated on Sat, Jul 6 2019 12:36 PM

attack on old man

 
చికిత్స పొందుతూ వద్ధుడి మతి
ఆత్మకూరురూరల్‌ : మద్యం మత్తులో పెదనాన్నపై దాడికి పాల్పడటంతో చికిత్స పొందుతూ అతను మతి చెందిన ఘటన మండలంలోని అప్పారావుపాళెం దళితకాలనీలో ఆదివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మెడబల్లి నరసయ్య (65) ప్రతి రోజూ తన ఇంటికి సమీపంలోని అరుగు వద్ద మంచంపై నిద్రిస్తుండే వాడు. శుక్రవారం రాత్రి నరసయ్య తమ్ముడి కొడుకు మెడబల్లి నరసింహబాబు మద్యం మత్తులో ఆ మంచంపై పడుకున్నాడు. నిద్రపోయేందుకు మంచం వద్దకు వచ్చిన నరసయ్య పడుకుని ఉన్న నరసింహబాబును చూసి తన చేతికర్రతో తట్టి లేపాడు. దీంతో  ఆగ్రహంతో అతను అదే కర్రతో నరసయ్యను తీవ్రంగా కొట్టాడు. గొడవ జరుగుతుందని బయటకు వచ్చిన నరసయ్య భార్య అడ్డుకోబోయింది. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో గాయపడిన భర్తను తీసుకుని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. శనివారం వైద్యం చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం మరురోజు నెల్లూరుకు తీసుకువెళ్లాలని, అదే రాత్రి గ్రామానికి చేరుకున్నారు. అయితే ఆదివారం తెల్లవారు జామున నరసయ్య పరిస్థితి విషమించడంతో మతి చెందాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ ఎస్‌కే ఖాజావళి, ఎస్‌ఐ ఎం.పూర్ణచంద్రరావు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేశారు. పెద్దనాన్నపై దాడికి పాల్పడిన నరసింహబాబును బంధువులు ఓ గదిలో బంధించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు నరసింహబాబు ఆరోగ్యం సరిలేక తీవ్ర స్థాయిలో మూర్ఛ (ఫిట్స్‌) రావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కాగా గతంలోనే ఇతనిపై రెండు కేసులు ఉన్నాయని, మరో 15 రోజుల్లో వివాహం జరగనుండటం గమనార్హం. మతదేహానికి పోస్టుమార్టం అనంతరం  బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement