దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి | AP Fiber Net Corporation Launch First Day First Show Concept In AP | Sakshi
Sakshi News home page

APFSL: 'ఏపీ ఫైబర్‌ నెట్.. ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే చూసేయొచ్చు'

Published Fri, Jun 2 2023 1:47 PM | Last Updated on Fri, Jun 2 2023 2:18 PM

AP Fiber Net Corporation Launch First Day First Show Concept In AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి అ‍న్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని పార్క్ హోటల్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడారు. 

(ఇది చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్: రానా కామెంట్స్ వైరల్)

గౌతం రెడ్డి మాట్లాడుతూ.. 'దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 99 రూపాయలకే సినిమా మొత్తం కుటుంబం చూడవచ్చు. ఈ 99 రూపాయ ప్లాన్ 24 గంటలు పని చేస్తుంది .' అని అన్నారు.

గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు: గుడివాడ అమర్‌నాథ్, ఐటీశాఖ మంత్రి

దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్ రాష్ట్రంలో తీసుకువచ్చామని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.  సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ఫ్యామీలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. 

గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ..'  ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సప్ట్‌తో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ఫిల్మ్ ఇండ్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 80 శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్నాయి. ఒక్కొసారి సినిమాలు విడుదలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అటువంటి సినిమాలకు పస్ట్ డే పస్ట్ షో ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగడుతుంది.' అని అన్నారు. 

చిన్న సినిమాలకు ఉపయోగం: నిర్మాత సి.కల్యాణ్

నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. '148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగం. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయంతో థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మంచి ప్రయోగం. చిన్న సినిమాలు బతుకుతాయి. కొంతమంది సినిమా వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం జగన్‌కు  ఎంతో మంచి పేరు వస్తుంది.' అని అన్నారు. 

సినిమా ఇండస్ట్రీకి వరం: రమాసత్యం నారాయణ, నిర్మాత

నిర్మాత నారాయణ మాట్లాడుతూ..'చిన్న సినిమాలు బతకాలంటే ఓటీటీ తరువాత ఫైబర్ నెట్ అవసరం. ప్రజలకు నవ రత్నాలను సీఎం జగన్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి పదో వరంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇచ్చారు. 99 రూపాయలకే ఇంటిల్లిపాది సినిమా హాయిగా సినిమా చూడవచ్చు.' అని అన్నారు. 

అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఏంటీ?

చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటోంది. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్‌ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా కేవలం రూ.99 కే ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ మూవీస్ చూడొచ్చు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే సదవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement