First Day First Show Movie
-
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని పార్క్ హోటల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడారు. (ఇది చదవండి: ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్: రానా కామెంట్స్ వైరల్) గౌతం రెడ్డి మాట్లాడుతూ.. 'దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 99 రూపాయలకే సినిమా మొత్తం కుటుంబం చూడవచ్చు. ఈ 99 రూపాయ ప్లాన్ 24 గంటలు పని చేస్తుంది .' అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు: గుడివాడ అమర్నాథ్, ఐటీశాఖ మంత్రి దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్ రాష్ట్రంలో తీసుకువచ్చామని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ఫ్యామీలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..' ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సప్ట్‌తో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ఫిల్మ్ ఇండ్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 80 శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్నాయి. ఒక్కొసారి సినిమాలు విడుదలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అటువంటి సినిమాలకు పస్ట్ డే పస్ట్ షో ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగడుతుంది.' అని అన్నారు. చిన్న సినిమాలకు ఉపయోగం: నిర్మాత సి.కల్యాణ్ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. '148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగం. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయంతో థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మంచి ప్రయోగం. చిన్న సినిమాలు బతుకుతాయి. కొంతమంది సినిమా వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు వస్తుంది.' అని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి వరం: రమాసత్యం నారాయణ, నిర్మాత నిర్మాత నారాయణ మాట్లాడుతూ..'చిన్న సినిమాలు బతకాలంటే ఓటీటీ తరువాత ఫైబర్ నెట్ అవసరం. ప్రజలకు నవ రత్నాలను సీఎం జగన్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి పదో వరంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇచ్చారు. 99 రూపాయలకే ఇంటిల్లిపాది సినిమా హాయిగా సినిమా చూడవచ్చు.' అని అన్నారు. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఏంటీ? చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటోంది. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా కేవలం రూ.99 కే ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ మూవీస్ చూడొచ్చు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే సదవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. -
ఓటీటీలో ఫస్ట్ డే ఫస్ట్ షో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?
'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. (చదవండి: First Day First Show Trailer: ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రైలర్ చూశారా?) తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ మూవీలో ప్రధానంగా పవన్ కల్యాణ్ 'ఖుషీ' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్స్ హీరో ఎలా సంపాదించాడనే అంశంపైనే కథను రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అంచనాలు పెంచినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. Relive the nostalgia of cinema and celebration 🎥 #FirstDayFirstShow will be streaming on @ahavideoIN from Sept 23rd.#FirstDayFirstShowOnAHA #FDFS @Im_Srikanth_R @SanchitaBashu24 @Wamceee @lnputtamchetty @anudeepfilm @radhanmusic @PoornodayaFilms @SrijaEnt @MitravindaFilms pic.twitter.com/dtbNM2A6FO — Srija Entertainments (@SrijaEnt) September 14, 2022 -
'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాన్న రోడ్డుపై పరుగెత్తించి కొట్టారు.. నాగబాబు నలిగిపోయాడు: చిరంజీవి
స్టార్ హీరోల సినిమాను ఫస్ట్‌డే ఫస్ట్ షో చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అందుకోసం చాలా కష్టపడతారు. ఇప్పుడైతే ఆన్లైన్లో టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి కానీ.. అప్పట్లో అయితే ఎవరైనా థియేటర్‌కి వెళ్లి టికెట్ కొనాల్సిందే. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫస్ట్‌డే ఫస్ట్ షో అనుభవం ఉందట. ఎన్టీఆర్ రామారావు సినిమా ఫస్ట్ షోకి వెళ్లి నాన్న చేతిలో దెబ్బలు తిన్నాడట. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన ఫస్డ్ డే ఫస్ట్ షో అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకొని నవ్వులు పూయించారు. ‘నాకు కూడా ఫస్డ్ డే ఫస్ట్ షో అనుభవం ఉంది. అయితే ఎప్పుడూ.. ఎక్కడా చెప్పుకోలేదు. ఎందుకంటే పరువు పోతుందేమో అని (నవ్వుతూ). నెల్లూరులో మా చుట్టాలబ్బాయి పూర్ణ అనేవాడు ఉండేవాడు. వాడికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. వాడితో కలిసి ఏవీఎమ్ వారి రాము సినిమాకు వెళ్లాం. నాన్నగారు మమ్మల్ని నేల, బెంచ్ కాకపోయినా.. కాస్త కుర్చీ రేంజ్‌లోనే సినిమాలు చూపించేవారు. కానీ ఆ రోజు నేలకు వెళ్లాల్సి వచ్చింది. (చదవండి: అప్పుడే సినీ పరిశ్రమ విలువేంటో తెలిసింది) నాతో పాటు తమ్ముడు నాగబాబు కూడా సినిమాకు వచ్చాడు. అప్పుడు నాగబాబు ఎర్రగా ఉండేవాడు. ఇరుకు గోడలు, అందరు కొట్టుకున్నారు. చెమటలు కక్కుతూ టికెట్ కోసం లోపలికి వెళ్తే.. మధ్యలో క్యూ ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయేంత పనైపోయింది. లోపలికి వెళ్లలేం..అలా అని బయటకు రాలేం. అందరిని పక్కకి నెడుతూ.. టికెట్లు తీసుకొని బయటకు వచ్చేసరికి మా నాన్న ఉన్నాడు. ఆయన అదే థియేటర్లో అంతకు ముందు షో చూసి వస్తున్నారు. అమ్మ కూడా ఉంది. తమ్ముడు నాగబాబు నలిగిపోయి, వెర్రిముఖం వేసుకొని ఉన్నాడు. నాన్న అక్కడ స్థంభానికి కట్టిన కొబ్బరి ఆకు నుంచి కొబ్బరి మట్ట పీకీ.. ‘నేల టికెట్‌కి వెళ్తారా.. తమ్ముడు చచ్చిపోతే ఎలా? అంటూ థియేటర్ నుంచి ఇంటిదాకా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అందుకే ఇప్పటికీ ఏవీఎమ్ రాము అంటే నాకు షివరింగ్ వచ్చేస్తుంది’అంటూ చిరంజీవి తన అనుభవాన్ని పంచుకున్నారు. -
Chiranjeevi: డైరెక్టర్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది పరిశ్రమ అపోహ మాత్రమేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారం రోజున 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ నన్ను ఎంతో పెద్ద వాణ్ణి చేసిందని తెలిపారు. సినీ రంగాన్ని వదిలి కొన్నాళ్లు వేరే రంగానికి వెళ్లాను. తిరిగొచ్చాకే సినీ పరిశ్రమ విలువ మరింత తెలిసిందన్నారు. సినీ పరిశ్రమలోకి కొత్త తరం రావాలన్నారు. ''పరిశ్రమలోకి ఆడబిడ్డలు అడుగుపెట్టాలి. నా ఇంటి నుంచి కూడా ఆడ బిడ్డలు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. సినీ పరిశ్రమలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది. ప్రేక్షకులకు మంచి కంటెంట్‌తో సినిమా వస్తే ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. దర్శకులు సినిమా విడుదలపై కాకుండా మంచి కథలపై దృష్టి పెట్టాలి. ప్రేక్షకులకు ఏది అవసరమో వాటిపైనే దృష్టి సారించాలి. నటీనటుల డేట్స్ క్లాష్ అవుతున్నాయని కంగారు కంగారుగా షూటింగ్స్ చేయొద్దు'' అని చిరంజీవి సూచించారు. చదవండి: (చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్, వీడియో షేర్ చేసిన మెగాస్టార్) -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
తెలుగు సినీ పరిశ్రమకు ఆగస్ట్ నెల మిశ్రమ ఫలితాన్ని అందించింది. గత కొన్ని రోజులుగా వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించి కొత్త ఆశలు రేకెత్తించాయి. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. ఇక ఈ వారం.. అంటె సెప్టెంబర్ నెలారంభంలో అటు థియేటర్లో ఇటు ఓటీటీలో అలరించడానికి పలు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. కోబ్రా తమిళ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’. వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ పాత్ర పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 31న థియేటర్స్‌లో విడుదల కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. రంగరంగ వైభవంగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన లెటెస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహించారు.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఫస్ట్‌డే ఫస్ట్ షో జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుజ్జీ..ఇలారా.. సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. చాందినీ, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెస్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు అమెజాన్ ప్రైమ్ ద లార్డ్ ఆఫ్ రింగ్స్(వెబ్ సిరీస్ తెలుగు), సెప్టెంబర్ 2 విడుదల ఆహా పంచతంత్ర కథలు (తెలుగు), ఆగస్ట్ 31 పెళ్లి కూతురు పార్టీ (తెలుగు), ఆగస్ట్ 31 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కఠ్పుత్లీ(హిందీ), సెప్టెంబర్ 2 ఖుదా హఫీజ్ 2(హిందీ), సెప్టెంబర్ 2 సోనీలీవ్ సుందరి గార్డెన్స్(మలయాళం), సెప్టెంబర్ 03 జీ5 విక్రాంత్ రోణ(తెలుగు), సెప్టెంబర్ 2 నెట్‌ఫ్లిక్స్ ఐ కేమ్ బై (ఒరిజినల్ మూవీ), ఆగస్ట్ 31 ఫ్యామిలీ సీక్రెట్స్(వెబ్ సిరీస్), ఆగస్ట్ 31 అండర్ హర్ కంట్రోల్(ఒరిజినల్ మూవీ), ఆగస్ట్ 31 -
అలా సినిమా చాన్స్ వచ్చింది.. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా
‘‘ముందు టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యాను. నా వీడియోలు చూసిన దర్శకుడు అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకి అవకాశం ఇచ్చారు’’ అన్నారు సంచిత బషు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. దర్శకుడు అనుదీప్ కథతో ఏడిద శ్రీజ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. సంచిత మాట్లాడుతూ – ‘‘చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన లయ పాత్రలో నటించాను. దర్శకులు వంశీ, లక్ష్మి నన్ను బాగా ప్రోత్సహించారు. నిర్మాత శ్రీజగారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు’’ అన్నారు. -
ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డా: అనుదీప్
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అనుదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని ఉండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు ఉంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ ఉన్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపథ్యాన్ని తీసుకుని ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’ కథని చెబుతున్నాం. ► నా జీవితానికి ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.`ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే ఉండదు. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. మహేశ్‌బాబు నటించిన 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం. ► లెక్కలు వేసుకొని నేను సినిమాలు తీయను. సినిమా చేసినప్పుడు మాజా రావాలి.అంతే. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. ► ఈ సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ ఉంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ ఉంటుంది. ► ‘జాతిరత్నాలు’లాగే `ఫస్ట్ డే ఫస్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ ఉంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే ఉంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. ► ఈ చిత్రానికి మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ ఉంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు ఉంటే బాగుండని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ ఉంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా బాధ్యత ఉంటుంది. ► రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో ఉన్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను. ► కామెడీ విషయంలో ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుంచి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా ఉన్న కథలు కూడా రాయాలని ఉంది. ► హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు ఉంటాయి. సినిమా అంటే క్రేజీ ఉండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నారాయణ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ ఉంది. ► నాగ్ అశ్విన్ `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం. ► శివకార్తికేయన్ తో చేస్తున్న ప్రిన్స్ సినిమా పాండిచ్చేరి నేపధ్యంలో సాగుతుంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళిలో రిలీజ్ ఉంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా ఉంటుంది. ► జాతిరత్నాలు 2 తీసే ఆలోచన ఉంది. అయితే దానికి ఇంకా రెండు మూడేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం వెంకటేశ్ కోసం ఓ కథను రాశా. త్వరలోనే ఆయనకు కథ వినిపిస్తా. ఆయన ఒప్పుకుంటే నా తర్వాతి చిత్రం వెంకటేశ్ గారితోనే ఉంటుంది. -
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
‘‘చిరంజీవిగారు, కమల్‌హాసన్‌గారు వంటి గొప్ప హీరోలతో మం క్లాసిక్ త్రాలు తీసిన పూరోదయ బ్యానర్లో నాకు హీరోగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి. దర్శకత్వంలో ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ అందించిన కథతో శ్రీకాంత్ రెడ్డి, సంత బాషు జంటగా నటించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పూరోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ (నటుడు ఏడిద శ్రీరామ్ కుమార్తె) నిర్మాతగా, శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్లో నిర్మించిన ఈ చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. మిత్రవింద మూవీస్ సహనిర్మాతగా ఏడిద శ్రీరామ్ సమర్పిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న రిలీజవుతోంది. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘పిట్టగోడ’ చిత్రంలో మెయిన్ లీడ్‌గా చేశాను. ఆ తర్వాత కొంత గ్యాప్ వ్చంది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ గురిం అనుదీప్ ఓసారి నాకు చెప్పాడు.. అద్భుతమైన కథ. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయిన తర్వాతే నన్ను హీరోగా ఫైనలైజ్ చేశారు. పవన్ కల్యాణ్‌గారి ‘ఖుషి’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథ’’ అన్నారు. -
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చచ్చిపోతా సర్..
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చస్తార్రా? చచ్చిపోతార్రా?' అన్న తనికెళ్ల భరణి డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. కట్ చేస్తే జైల్లో ఉన్న హీరో నేను చస్త సర్, పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే నేను చచ్చిపోత సర్ అని ఆన్సరిస్తాడు. మరో సీన్లో ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం టికెట్లు తెస్తానని తను ప్రేమించే అమ్మాయి దగ్గర పోజు కొడతాడు హీరో. మరోవైపు ఈ పిచ్చి అలవాటుని మాన్పించాలని తాపత్రయపడుతున్నాడు అతడి తండ్రి పాత్ర పోషించిన తనికెళ్ల భరణి. మొత్తానికి ట్రైలర్ అయితే సరదాగా కొనసాగగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకుల మోములపై నవ్వులు పూయిస్తోంది. చదవండి: వాళ్లిద్దరూ నా షోలో ఎప్పటికీ అడుగు పెట్టరు ‘లైగర్’ ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే.. -
‘ఫస్ట్ డే ఫస్ట్ షో' కోసం పవన్ కల్యాణ్‌ని వాడుకున్నాం
‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ లాంటి సినిమాలను అందించిన సంస్థ పూర్ణోదయ మవీ క్రియేషన్స్. దీని అనుబంధ సంస్థ శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు.. `ఫస్ట్ డే ఫస్ట్ షో` కథ ఎలా ఉండబోతుంది ? వంశీ : ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్. కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత శ్రీనుతో తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా `ఫస్ట్ డే ఫస్ట్ షో` టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్ల సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా ఎంటర్ టైనింగ్ ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. హీరో గోల్.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం. ఆ గోల్ ని రీచ్ అయ్యే క్రమంలో చాలా సర్ ప్రైజులు ఉంటాయి. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇద్దరు దర్శకులని తీసుకోవడానికి కారణం ? వంశీ : 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ చాలా ఎక్సయిట్ చేసింది. దర్శకుడిగా లాంచ్ అవ్వడం కంటే కథని అద్భుతంగా తీయాలనే ఆలోచనపైనే దృష్టి ఉండేది. ఫస్ట్ టైం డైరెక్టర్ గా నాకు అంత అనుభవం లేదు. మరొకరు ఉండే బావువుంటుందని అనుకున్నాం. నాకు లక్ష్మీ నారాయణకి మంచి సింక్ ఉంది. చాలా అద్భుతమైన సమన్వయంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా కథ విషయంలో వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా ? వంశీ : ఖుషి సినిమా సమయంలో నేను ఫస్ట్ క్లాస్. నా అనుభవంలో లేవు కానీ అనుదీప్ వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్పేవారు. టికెట్ల కోసం ఎంతదూరం వెళ్తారో చెబుతుంటే చాలా సీరియస్ గా, అదే సమయంలో ఫన్నీ అనిపిస్తాయి. అప్పట్లో చాలా మానియా ఉండేది. ఖుషి అంటే 2001.. ఈ సినిమా కోసం అప్పటి వాతావరణం రిక్రియేట్ చేశారా ? చాలా అంశాలు రిక్రియేట్ చేశాం. టీజర్ లో చూస్తే అప్పటి బాక్సులు కనిపిస్తాయి. దాంతో పాటు చాలా వరకు అప్పటి వావతరణం సృష్టించాం. హీరో హీరోయిన్ల గురించి వంశీ: శ్రీకాంత్ పిట్టగోడ అనే సినిమాలో చేశాడు. ఆడిషన్ చేశాం. తెలంగాణ యాస, సింపుల్ హ్యుమర్, అమాయకత్వంతో కథకు సరిగ్గా నప్పాడు. హీరోయిన్ సంచితాది బిహార్. ఫస్ట్ డే ఫస్ట్ షో మరో జాతిరత్నాలు అనుకోవచ్చా ? వంశీ: ఫస్ట్ డే ఫస్ట్ షో డిఫరెంట్ మూవీ. అయితే జాతిరత్నాలు ఫ్లేవర్ ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో మీ అనుభవాలు గురించి ? లక్ష్మీనారాయణ : తిరుపతిలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరికేవి. రాత్రి మూడు గంటలకు షో వుండేది. అలా పంజా సినిమా చూశా. చాలా మంది జనం వుండేవారు. అప్పుడప్పుడు తొక్కిసలాట వుండేది. అందుకే ఈ కథకి చాలా కనెక్ట్ అయ్యా. వంశీ: నా జనరేషన్ కి వచ్చేసరికి టికెట్లు సులువుగానే దొరికేవి. ఒక్కడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా. కథలో పవన్ కళ్యాణ్ ని ఎంతవరకూ వాడుకున్నారు ? హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కథలో ఎంత మేరకు వాడాలో అంతవరకు ఉంటుంది. ఏది వాడినా సినిమాని వినోదాత్మకంగా చేయడానికే ప్రయత్నించాం. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నటులతో పని చేయడం ఎలా అనిపించింది ? లక్ష్మీ నారాయణ : సీనియర్స్ తో పని చేయడం చాలా మంచి అనుభవం. వారి అనుభవంతో యాడ్ చేసిన ఫ్లావర్ అద్భుతం అనిపించింది. వారితో పని చేయడానికి కాస్త భయపడ్డాం. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ నటులకు మనం ఏం చెప్పగలం అనిపించేది. ఐతే వాళ్ళు గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. అందరి సీన్స్ అద్భుతంగా వచ్చాయి. యంగ్ టీంతో పని చేయడాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. భవిష్యత్ లో ఇద్దరూ కలసి ప్రయాణించే ఆలోచన ఉందా ? వంశీ: ఇప్పటికి ఏం అనుకోలేదు. ఈ సినిమాకి అవసరం కాబట్టి కలసి చేశాం. మీకు బలమున్న జోనర్ ఏది ? వంశీ : కామెడీ. అలాగే నాకు నటనపై కూడా ఆసక్తి ఎక్కువ లక్ష్మీ నారాయణ: అన్ని జోనర్స్ చేస్తాను. కామెడీ కొంచెం ఎక్కువ ఇష్టం సంగీతం గురించి చెప్పండి ? రధన్ చాలా ప్రతిభ ఉన్న కంపోజర్. భాష తెలియనప్పటికీ ఆయనకి గొప్ప అండర్ స్టాండింగ్ వుంది. పాటలతో పాటు అద్భుతమైన నేపధ్య సంగీతం అందించారు. పూర్ణోదయలో సినిమా చేయడం ఎలా అనిపించింది ? పూర్ణోదయ అంటేనే క్లాసిక్. సినిమాని ప్రేమించే నిర్మాతలు. సినిమాలో స్వర్ణయుగం చూశారు. శ్రీజ గారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మొదటిసారి సినిమా చేస్తున్న నిర్మాతలా అనిపించలేదు. చాలా ఫాస్ట్ గా చేశారు. అనుకున్న షెడ్యుల్ ప్రకారమే షూటింగ్ ఫినిష్ చేయడం వారికి చాలా నచ్చింది. కొత్తగాచేయబోతున్న సినిమాలు ? కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఏదీ ఖరారు కాలేదు.