‘‘చిరంజీవిగారు, కమల్‌హాసన్‌గారు వంటి గొప్ప హీరోలతో మం క్లాసిక్ త్రాలు తీసిన పూరోదయ బ్యానర్‌లో నాకు హీరోగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి. దర్శకత్వంలో ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ అందించిన కథతో శ్రీకాంత్ రెడ్డి, సంత బాషు జంటగా నటించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పూరోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ (నటుడు ఏడిద శ్రీరామ్ కుమార్తె) నిర్మాతగా, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మించిన ఈ చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’.
మిత్రవింద మూవీస్ సహనిర్మాతగా ఏడిద శ్రీరామ్ సమర్పిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న రిలీజవుతోంది. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘పిట్టగోడ’ చిత్రంలో మెయిన్ లీడ్‌గా చేశాను. ఆ తర్వాత కొంత గ్యాప్ వ్చంది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ గురిం అనుదీప్ ఓసారి నాకు చెప్పాడు.. అద్భుతమైన కథ. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయిన తర్వాతే నన్ను హీరోగా ఫైనలైజ్ చేశారు. పవన్ కల్యాణ్‌గారి ‘ఖుషి’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథ’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment