సాక్షి, హైదరాబాద్: ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది పరిశ్రమ అపోహ మాత్రమేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారం రోజున 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ నన్ను ఎంతో పెద్ద వాణ్ణి చేసిందని తెలిపారు. సినీ రంగాన్ని వదిలి కొన్నాళ్లు వేరే రంగానికి వెళ్లాను. తిరిగొచ్చాకే సినీ పరిశ్రమ విలువ మరింత తెలిసిందన్నారు. సినీ పరిశ్రమలోకి కొత్త తరం రావాలన్నారు.
''పరిశ్రమలోకి ఆడబిడ్డలు అడుగుపెట్టాలి. నా ఇంటి నుంచి కూడా ఆడ బిడ్డలు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. సినీ పరిశ్రమలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది. ప్రేక్షకులకు మంచి కంటెంట్‌తో సినిమా వస్తే ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. దర్శకులు సినిమా విడుదలపై కాకుండా మంచి కథలపై దృష్టి పెట్టాలి. ప్రేక్షకులకు ఏది అవసరమో వాటిపైనే దృష్టి సారించాలి. నటీనటుల డేట్స్ క్లాష్ అవుతున్నాయని కంగారు కంగారుగా షూటింగ్స్ చేయొద్దు'' అని చిరంజీవి సూచించారు.
చదవండి: (చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్, వీడియో షేర్ చేసిన మెగాస్టార్)
Comments
Please login to add a commentAdd a comment