Anudeep KV Talk About First Day First Show Movie Deets Inside - Sakshi
Sakshi News home page

First Day First Show: ఫస్ట్‌డే ఫస్ట్‌ షో.. సవాల్‌తో కూడుకున్న కథ : అనుదీప్ కెవి

Published Sat, Aug 27 2022 5:15 PM | Last Updated on Sat, Aug 27 2022 5:38 PM

Anudeep KV Talk About First Day First Show Movie - Sakshi

జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అనుదీప్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని ఉండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు ఉంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్‌ ఉన్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపథ్యాన్ని తీసుకుని ‘ఫస్ట్‌డే ఫస్ట్‌ షో’ కథని చెబుతున్నాం. 

► నా జీవితానికి ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. టికెట్స్‌, ఫ్యాన్స్‌ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే​.`ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే  ఉండదు. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్.  మహేశ్‌బాబు నటించిన 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం.

► లెక్కలు వేసుకొని నేను సినిమాలు తీయను. సినిమా చేసినప్పుడు మాజా రావాలి.అంతే. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. 

► ఈ సినిమా హీరో శ్రీకాంత్‌ రెడ్డి  నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ ఉంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ ఉంటుంది.

► ‘జాతిరత్నాలు’లాగే `ఫస్ట్ డే ఫస్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్  ఉంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే  ఉంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా  ఉన్నారు. 

► ఈ చిత్రానికి మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్  ఉంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు  ఉంటే బాగుండని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్  ఉంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా బాధ్యత ఉంటుంది. 

► రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో  ఉంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో  ఉన్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను. 

► కామెడీ విషయంలో ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుంచి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా ఉన్న కథలు కూడా రాయాలని ఉంది.

► హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు  ఉంటాయి. సినిమా అంటే క్రేజీ  ఉండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నారాయణ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ ఉంది.

► నాగ్ అశ్విన్ `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం. 

► శివకార్తికేయన్  తో చేస్తున్న ప్రిన్స్ సినిమా పాండిచ్చేరి నేపధ్యంలో సాగుతుంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళిలో రిలీజ్ ఉంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా  ఉంటుంది.

► జాతిరత్నాలు 2 తీసే ఆలోచన ఉంది. అయితే దానికి ఇంకా రెండు మూడేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం వెంకటేశ్‌ కోసం ఓ కథను రాశా. త్వరలోనే ఆయనకు కథ వినిపిస్తా. ఆయన ఒప్పుకుంటే నా తర్వాతి చిత్రం వెంకటేశ్‌ గారితోనే ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement