
‘‘ముందు టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యాను. నా వీడియోలు చూసిన దర్శకుడు అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకి అవకాశం ఇచ్చారు’’ అన్నారు సంచిత బషు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’.
దర్శకుడు అనుదీప్ కథతో ఏడిద శ్రీజ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. సంచిత మాట్లాడుతూ – ‘‘చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన లయ పాత్రలో నటించాను. దర్శకులు వంశీ, లక్ష్మి నన్ను బాగా ప్రోత్సహించారు. నిర్మాత శ్రీజగారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment