కృష్ణా: కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లాలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రావుతో పాటు పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.
'కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'
Published Sun, Nov 29 2015 4:59 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement