
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : గత ఎన్నికల్లో కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో కార్మికులు ఇచ్చిన 42 వాగ్ధానాల్లో కనీసం ఒక్కటైనా నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్‌కు మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు కార్మికుల పొట్ట కొట్టేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించే ప్రభుత్వం కావాలని, అది వైఎస్ జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. అన్ని రంగాల కార్మికులకు అన్యాయం చేసిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 7న కడపలో జరగబోయే బూత్ స్థాయి కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment