AP Fiber Net: Good News for Andhra Pradesh Fiber Net Users - Sakshi
Sakshi News home page

ఏపీ ఫైబర్‌ నెట్‌ వినియోగదారులకు శుభవార్త! సినిమా విడుదల రోజే ఓటీటీలో చూసే ఛాన్స్‌!

Apr 6 2023 7:14 PM | Updated on Apr 6 2023 7:47 PM

APSFL Announce Good News to Users - Sakshi

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సర్వీసెస్‌ సబ్‌స్క్రైబ్‌  చేసుకొని  "ఫస్ట్ డే ఫస్ట్  షో"  చూడవచ్చు. ఏపీ ఫైబర్ నెట్  డిజిటల్ సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్  ప్రజల జీవితాలను మార్చడం,

ఇంటర్నెట్‌ వచ్చాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అదే విధంగా ఓటీటీలు వచ్చాక థియేటర్‌లో ఏ సినిమా రిలీజైనా కొంతకాలానికి ఓటీటీలోకి వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్‌లో  కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 

ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలకు గొప్ప సువర్ణ అవకాశం అనే చెప్పవచ్చు. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రసాద్‌ ల్యాబ్స్‌ వేదికగా ఏప్రిల్ 7 న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికె APSFL(ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌)లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సర్వీసెస్‌ సబ్‌స్క్రైబ్‌  చేసుకొని  "ఫస్ట్ డే ఫస్ట్  షో"  చూడవచ్చు. ఏపీ ఫైబర్ నెట్  డిజిటల్ సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్  ప్రజల జీవితాలను మార్చడం, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను వివక్షత లేని ప్రాతిపదికన అందుబాటులో ఉండే "ట్రిపుల్ ప్లే" సేవలను (IPTV, ఇంటర్నెట్, టెలిఫోన్) అందించడం.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు, ప్రభుత్వ సంస్థలకు ఇది మానవాభివృద్ధిని సులభతరం చేస్తుంది. ఆర్థికాభివృద్ధిని పెంచుతుంది. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. 

APSFL తన నిరంతర ప్రయత్నాల ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో సురక్షితమైన, నమ్మదగిన, అధిక నాణ్యత గల కనెక్టివిటీని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం APSFLలో ఎన్నో మార్పులు తీసుకురావడంతో అది మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైబర్ నెట్ చైర్మన్  పునూరు గౌతంరెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ, సినీ నిర్మాత సి కళ్యాణ్ గారు, ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement