
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. గిరిజనులు అత్యధికంగా నివసించే ఐటీడీఏ పాడేరు, రంపచోడవరం లాంటి ప్రాంతాలకు సైతం కార్యకలాపాలను చేరువ చేసింది.
సాక్షి, అమరావతి: ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ప్రతిష్టను కుంభకోణాలతో మసకబార్చిన గత సర్కారు నిర్వాకాలపై ఏనాడూ స్పందించని ఈనాడుకు హఠాత్తుగా ఫైబర్‌నెట్ గుర్తొచ్చింది. అంతే.. ‘ఫైబర్ నెట్‌కు పాతర’ శీర్షికన ఓ కథనాన్ని వండి పారేసి చంకలు గుద్దుకుంది. నిజం చెప్పాలంటే పాతర వేసింది ఫైబర్ నెట్‌కు కాదు.. కుంభకోణాలకే తెర పడింది మరి!
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. గిరిజనులు అత్యధికంగా నివసించే ఐటీడీఏ పాడేరు, రంపచోడవరం లాంటి ప్రాంతాలకు సైతం కార్యకలాపాలను చేరువ చేసింది.
మరింత స్పీడ్.. అధిక డేటాతో
ఈనాడు పత్రిక ప్రచురించిన కథనాలను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ తీవ్రంగా ఖండించింది. 2018లో కనెక్షన్ల సంఖ్య 3.12 లక్షలు కాగా 2019 అక్టోబర్ నాటికి 7.3 లక్షలకు పెరిగి ఇప్పటికీ అదే సంఖ్య కొనసాగుతోందని స్పష్టం చేసింది. గతం కంటే అధిక స్పీడ్, అధిక డేటాతో ప్యాకేజీలను ప్రవేశపెట్టి వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. గతంలో రూ.235 ప్యాకేజీ ద్వారా 50 జీబీ డేటా, 10 ఎంబీఎస్ స్పీడ్ ఉండగా 2021 సెపె్టంబర్ 21 నుంచి 150 జీబీ డేటా, 20 ఎంబీపీఎస్ స్పీడ్‌కు పెంచినట్లు వివరించింది. డేటా వినియోగం ఆధారంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.508 వరకు నాలుగు రకాల ప్యాకేజీలను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ప్రవేశపెట్టింది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా 2022 ఆగస్టు 22 నుంచి ప్రీపెయిడ్ సేవలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
కొత్తగా 15,421 ప్రాంతాలకు..
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల నుంచి 13 ప్రాజెక్టులను దక్కించుకోవడం ద్వారా వ్యాపారపరంగా ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ మరింత విస్తరించింది. 15,421 కొత్త ప్రాంతాలకు సేవలను అందించడమే కాకుండా 15,000 కి.మీ ఫైబర్ కనెక్టివిటీని విస్తరించింది. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఫ్యామిలీ హెల్త్‌కేర్ లాంటి 13కుపైగా కీలక ప్రాజెక్టులను దక్కించుకొని వేగవంతమైన నెట్ సేవలను అందిస్తోంది. శ్రీసిటీలోని ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తోంది. వీటితో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఆదాయం గణనీయంగా పెరిగింది. 2018–19లో రూ.51.25 కోట్లుగా ఉన్న ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఆదాయం 2021–22 నాటికి రూ.215.63 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రూ.150.50 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
నాడు.. టెరాసాఫ్ట్ ముసుగులో
టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఫేజ్–1 ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్‌కు కట్టబెట్టడం ద్వారా పెద్ద ఎత్తున నిధులను దారి మళ్లించినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో 18 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు రూ.120 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలతో తేలడంతో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ కె.సాంబశివరావు, టెరాసాఫ్ట్ సబ్‌కాంట్రాక్టర్ కోటేశ్వరరావులను సీఐడీ అరెస్ట్ చేసింది.
చదవండి: 20 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆసక్తికర విషయాలు..