సాక్షి, అమరావతి: ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఇది ఒక కేస్ స్టడీ లాంటిదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నారు. 2021లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైనట్లు చెప్పారు.
చంద్రబాబు తన ఓఎస్‌డీ అభీష్ణ ద్వారా ఈవీఎంల దొంగ వేమూరి హరికృష్ణప్రసాద్‌ని మెంబర్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సి ల్‌గా నియమించాలని ఐటీ కార్యదర్శికి లేఖ రాశా రని చెప్పారు. ప్రాజెక్టు సాంకేతిక మదింపు కమిటీ, టెండర్ మదింపు కమిటీలోనూ హరికృష్ణప్రసాద్ సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారా మయ్య 2000 సెప్టెంబర్ 30 నుంచి 2014 వరకు టెరా సాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్‌గా ఉన్నారని వెల్లడించారు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టుపై మంగళవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు.
బ్లాక్ లిస్టు కంపెనీకి టెండర్
అప్పటిదాకా బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్‌ను రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. అప్పటి ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ దీనిపై అభ్యంతరం తెలిపితే ఆయన్ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. ఈ స్కామ్ పూర్తిగా చంద్రబాబు కనుస న్నల్లోనే జరిగింది.
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేయగా అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చా రు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్‌వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్‌వేర్ అడ్రస్ ఒక్కటే. అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బులను తరలించారు.
పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చంద్రబాబు వద్దకు చేరింది. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ వెబ్‌సైట్‌లో ఏపీ ప్రాజెక్టు గురించి ఎక్కడా లేదు. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక ప్రాజెక్టుల గురించి మాత్రమే ఉంది. తమకున్న వ్యాపార సంస్థలో 2 శాతం అమ్మేస్తే రూ.400 కోట్లు వస్తాయని బాబు సతీమణి అంటున్నారు. ఆ వ్యాపారాలు ఉండడానికి ఆమె భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? 2 శాతం అమ్మితేనే రూ.400 కోట్ల వస్తాయంటే వంద శాతం అమ్మేస్తే రూ. 20 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు రెండు ఎకరాల నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు?
అన్నీ అవకతవకలే: వేణుగోపాల్, ఎమ్మెల్యే
టెండర్లలో నిబంధనలను పాటించలేదు. ఇతర సంస్థలతో కన్సార్టియమ్‌గా ఏర్పడి టెరాసాఫ్ట్ వేసిన టెండర్ డాక్యుమెంట్లు సరైనవి కాకపోవడంతో ఇతరులు అభ్యంతరం తెలిపారు. ఈ స్కామ్‌కు ప్రత్యక్ష సాక్షిని, బాధితుడిని నేనే కనుక ఈ విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతున్నా.
సూత్రధారులు బాబు, లోకేశ్‌లే:
అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లే. వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీకి పాల్పడ్డారు. టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనాన్ని దోచేశారు.
బాబు అవినీతిని ఎవరు కట్ చేస్తారు?
(ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై 26.3.2016న ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ఏమన్నారో తాజాగా సభలో ప్రదర్శించారు) ‘చంద్రబాబు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ప్రాజెక్టును రూ.333 కోట్లకు ఎంత దారుణంగా ఇచ్చారో, ఇందులో ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందో చెబుతా. చౌక దుకాణాల్లో ఈ–పోస్ యంత్రాలను అమర్చడంలో విఫలమై బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ అనే సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులను రూ.333 కోట్లకు ఎలా అప్పగించారో చంద్రబాబుకే తెలియాలి.
హెరిటేజ్‌తో సంబం«ధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్‌కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30 వరకు టెరా సాఫ్ట్‌వేర్‌లోనూ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదే సంస్థకు ఫైబర్ ఆప్టికల్ పనుల్ని చంద్రబాబు అప్పగించారు. వేమూరి హరికృష్ణప్రసాద్, చంద్రబాబు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు తేటతెల్లమవు తుంటే ఇక ఇది ఏ రకంగా పారదర్శకం? ఇది సబబేనా? పెన్షన్లు, ఇళ్ల విషయంలో ఒకటో అరో అవినీతి జరిగితే కట్ చేయాలంటాడు చంద్రబాబు. మరి ఆయనే దగ్గరుండి చేస్తున్న అవినీతిని ఎవరు కట్ చేస్తారు?’ అని అప్పట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment