Andhra Pradesh Latest News
-
ఎన్నికల నాటికి 'తణుకు' ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..?
'తెలుగుదేశం-జనసేన పొత్తు వ్యవహారంలో చాలా చోట్ల టిడిపి అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమ నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయిస్తారేమోనని టిడిపినేతలు కంగారు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో ఓ నియోజక వర్గంలో టిడిపి-జనసేన నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది నేనంటే నేనే అంటూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే జనసేన అభ్యర్ధి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో టిడిపి శ్రేణులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జనసేనకే ఆ సీటు ఇస్తే వారికి సహకరించే ప్రసక్తి లేదని టిడిపి శ్రేణులు భీష్మించుకుని ఉన్నాయంటున్నారు.' స్థానిక టీడీపీ నేతల్లో సెగలు..! తణుకు నియోజకవర్గం నుండి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టిడిపికి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తణుకు నుంచే పోటీ చేయాలని ఆరిమిల్లి భావిస్తున్నారు. అయితే ఆ మధ్య వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తణుకు సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తణుకు నుండి తమ పార్టీ తరపున విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రకటించి సంచలనం సృష్టించారు. అది స్థానిక టీడీపీ నేతల్లో మంట పుట్టించింది. టిడిపి-జనసేనల మధ్య పొత్తు అప్పటికి ఖరారు కాలేదు. పొత్తు పెట్టుకుంటాం అని అన్నా కూడా సీట్ల సద్దుబాటు కాలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా విడివాడ రామచంద్రరావు పేరు ప్రకటించడం ఏంటని టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. అయితే పవన్ అలా ప్రకటించిన క్షణం నుంచి వచ్చే ఎన్నికల్లో తణుకు నియోజక వర్గంలో టిడిపి-జనసేనల తరపు అభ్యర్ధిని తానే అని విడివాడ రామచంద్రరావు ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని చెప్పుకుంటున్నారు. తణుకు సీటు నాదంటే నాదే..! ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన సందర్బంగా ఆయన విజయవాడ దాకా ర్యాలీగా వెళ్తూ తణుకు వద్ద ఆగారు. అక్కడ జనసేన అభ్యర్ధి విడివాడ రామచంద్రరావు అమాంతం వచ్చి చంద్రబాబు కాళ్లకు నమస్కరించేశారు. ఆయన్ను చంద్రబాబు కూడా ఆప్యాయంగా లేవదీసి భుజం తట్టారు. టిడిపి అభ్యర్ధి ఆరిమిల్లి కూడా చంద్రబాబుకు అభివందనం చేశారు. కానీ విడివాడ రామచంద్రరావును రిసీవ్ చేసుకున్నంత సన్నిహితంగా ఆరిమిల్లిని చంద్రబాబు రిసీవ్ చేసుకోలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. తణుకు సీటును జనసేనకు కేటాయించేసినట్లే అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆరిమిల్లి, విడివాడ ఎవరికి వారే రాబోయే ఎన్నికల్లో తణుకు సీటు నాదంటే నాదే అని తమ తమ శిబిరాల ద్వారా ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..? అని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. ఇవి చదవండి: భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం! -
ఒకే కుటుంబం.. రాజకీయ విరోధం!
సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. ఇలా అధికారం కోసం బద్ధ వైరులుగా మారిన వారిలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నేతలున్నారు. నవంబర్ 17వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తోబుట్టువులు, మామ– మేనల్లుడు, బావమరుదులు, అల్లుళ్లు, అత్తలు, మామలు..ఇలా రాజకీయ ప్రత్యర్థులుగా రంగంలోకి దిగారు. నర్మదాపురం స్థానంలో బీజేపీ అభ్యరి్థ, అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్ శర్మపై స్వయానా ఆయన సోదరుడు గిరిజాశంకర్ శర్మ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయిన గిరిజా శంకర్ సొంత పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో ఉదాహరణ..సాగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌కు చెందిన నిధి సునీల్ జైన్, తన బావ, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే శైలేంద్ర జైన్‌పై పోటీకి దిగారు. శైలేంద్ర జైన్ చిన్న తమ్ముడు సునీల్ జైన్ భార్యే నిధి జైన్. దియోరి నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సునీల్ జైన్. అదేవిధంగా, రేవా జిల్లా డియోతలాబ్లో కాంగ్రెస్ పార్టీ పద్మేష్ గౌతమ్‌ను పోటీకి నిలిపింది. ఈయన మామ, బీజేపీకి చెందిన ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. హర్దా జిల్లా తిమారి్నలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి సంజయ్ షాపై ఆయన మేనల్లుడు అభిజీత్ షా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ముఖాముఖి తలపడటం ఇది రెండోసారి. గ్వాలియర్ జిల్లా దాబ్రాలో బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఇమార్తి దేవిపై ఆమె బంధువు సిట్టింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేశ్ రాజేతో తలపడుతున్నారు. ఇమార్తి దేవి మేనకోడలు రాజే కుటుంబంలో కోడలిగా ఉన్నారు. కుటుంబసభ్యులు ఎన్నికల్లో పరస్పరం తలపడటంపై సీనియర్ జర్నలిస్ట్, వ్యాఖ్యాత ఆనంద్ పాండే మాట్లాడుతూ..‘ఇది సైద్ధాంతిక సంఘర్షణ కానే కాదు. కేవలం అధికారం, పదవుల కోసం జరిగే పోరాటం’అని పేర్కొన్నారు. -
ఆర్బీకేల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఉన్న ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)కు నిర్ణయించింది. అవసరానికి మించి ఉన్న మండలాల్లోని ఆర్బీకేల సిబ్బందిని తక్కువ ఉన్న మండలాలకు సర్దుబాటు చేయనుంది. అక్టోబర్ కల్లా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత నవంబర్‌లో తాజా పోస్టింగుల ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల గుమ్మం వద్దకు పౌర సేవలందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాలకు అనుబంధంగా రైతు సేవల కోసం ప్రత్యేకంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్వపు జిల్లా ప్రాతిపదికన జరిగిన నియామకాల ద్వారా వీటిలో 6,218 మంది వ్యవసాయ, 2,352 మంది ఉద్యాన, 374 మంది పట్టు సహాయకులతో పాటు 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మలీ్టపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు పని చేస్తున్నారు. ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్బీకేకు స్థానికంగా సాగయ్యే పంటలనుబట్టి గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. సిబ్బందిపై పనిఒత్తిడి తగ్గించడమే లక్ష్యం కొన్ని మండలాల్లో ఒక సచివాలయం పరిధిలో రెండు, అంతకు మించి ఆర్బీకేలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఒకే మండలంలో కొన్ని ఆర్బీకేల పరిధిలో సాగు విస్తీర్ణం పదుల ఎకరాల్లో ఉంటే, కొన్నింటిలో వందల ఎకరాలు, మరికొన్నింటిలో 7 వేలు, 8 వేల ఎకరాల్లో ఉంది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. సర్టీఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, పంటల వివరాలను ఈ క్రాప్ యాప్‌లో నమోదు చేయడం, పొలాలకు వెళ్లి ఫొటోలతో పాటు రైతుల ఈ కేవైసీ నమోదు చేయడం, వైపరీత్యాల వేళ నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయడం, పంట కోత ప్రయోగాలు, పంటల బీమా అమలు.. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీకే వ్యవస్థలో హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సంకల్పించింది. విస్తీర్ణం ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటు హేతుబద్ధీకరణలో భాగంగా పంటల విస్తీర్ణం ప్రాతిపదికన మండలం యూనిట్‌గా సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 600 నుంచి 800 ఎకరాలకు, మైదాన ప్రాంతాల్లో 1000 నుంచి 1500 ఎకరాలకు ఒకరు చొప్పున సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేస్తోంది. అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర మండలాల్లో సర్దుబాటు చేస్తారు. స్థానికంగా సాగయ్యే ఉద్యాన, పట్టు పంటలను బట్టి వీఎస్ఏ, వీహెచ్ఎలకు తొలి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న చోట ఉద్యాన ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. వ్యవసాయ పంటలు సాగు ఎక్కువగా ఉంటే ఏఈవో, వ్యవసాయ ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఏఈవో, ఏంపీఈవోలను నియమిస్తారు. ఏఈవోలను జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తుండగా, ఎంపీఈవోలను అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల పరిధిలో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించారు. ఖరీఫ్ తర్వాతే రిపోర్టింగ్ ప్రస్తుతం ఖరీఫ్–2023 సీజన్ ఈ క్రాప్ బుకింగ్ జోరుగా సాగుతోంది. మరో వైపు కోతలు ప్రారంభమైన తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాతే సర్దుబాటు చేసిన సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలి. జిల్లాల పరిధిలో స్థానిక అవసరాలనుబట్టి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
ఫైబర్ నెట్లో రూ.114 కోట్లు దోచేశారు!
సాక్షి, అమరావతి: ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఇది ఒక కేస్ స్టడీ లాంటిదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నారు. 2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైనట్లు చెప్పారు. చంద్రబాబు తన ఓఎస్డీ అభీష్ణ ద్వారా ఈవీఎంల దొంగ వేమూరి హరికృష్ణప్రసాద్ని మెంబర్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సి ల్గా నియమించాలని ఐటీ కార్యదర్శికి లేఖ రాశా రని చెప్పారు. ప్రాజెక్టు సాంకేతిక మదింపు కమిటీ, టెండర్ మదింపు కమిటీలోనూ హరికృష్ణప్రసాద్ సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారా మయ్య 2000 సెప్టెంబర్ 30 నుంచి 2014 వరకు టెరా సాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్‌గా ఉన్నారని వెల్లడించారు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టుపై మంగళవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. బ్లాక్ లిస్టు కంపెనీకి టెండర్ అప్పటిదాకా బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్‌ను రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. అప్పటి ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ దీనిపై అభ్యంతరం తెలిపితే ఆయన్ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. ఈ స్కామ్ పూర్తిగా చంద్రబాబు కనుస న్నల్లోనే జరిగింది. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేయగా అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చా రు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బులను తరలించారు. పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చంద్రబాబు వద్దకు చేరింది. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ వెబ్సైట్లో ఏపీ ప్రాజెక్టు గురించి ఎక్కడా లేదు. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక ప్రాజెక్టుల గురించి మాత్రమే ఉంది. తమకున్న వ్యాపార సంస్థలో 2 శాతం అమ్మేస్తే రూ.400 కోట్లు వస్తాయని బాబు సతీమణి అంటున్నారు. ఆ వ్యాపారాలు ఉండడానికి ఆమె భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? 2 శాతం అమ్మితేనే రూ.400 కోట్ల వస్తాయంటే వంద శాతం అమ్మేస్తే రూ. 20 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు రెండు ఎకరాల నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? అన్నీ అవకతవకలే: వేణుగోపాల్, ఎమ్మెల్యే టెండర్లలో నిబంధనలను పాటించలేదు. ఇతర సంస్థలతో కన్సార్టియమ్గా ఏర్పడి టెరాసాఫ్ట్ వేసిన టెండర్ డాక్యుమెంట్లు సరైనవి కాకపోవడంతో ఇతరులు అభ్యంతరం తెలిపారు. ఈ స్కామ్‌కు ప్రత్యక్ష సాక్షిని, బాధితుడిని నేనే కనుక ఈ విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతున్నా. సూత్రధారులు బాబు, లోకేశ్‌లే: అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లే. వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీకి పాల్పడ్డారు. టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనాన్ని దోచేశారు. బాబు అవినీతిని ఎవరు కట్ చేస్తారు? (ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై 26.3.2016న ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ఏమన్నారో తాజాగా సభలో ప్రదర్శించారు) ‘చంద్రబాబు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ప్రాజెక్టును రూ.333 కోట్లకు ఎంత దారుణంగా ఇచ్చారో, ఇందులో ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందో చెబుతా. చౌక దుకాణాల్లో ఈ–పోస్ యంత్రాలను అమర్చడంలో విఫలమై బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనే సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులను రూ.333 కోట్లకు ఎలా అప్పగించారో చంద్రబాబుకే తెలియాలి. హెరిటేజ్‌తో సంబం«ధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30 వరకు టెరా సాఫ్ట్‌వేర్‌లోనూ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదే సంస్థకు ఫైబర్ ఆప్టికల్ పనుల్ని చంద్రబాబు అప్పగించారు. వేమూరి హరికృష్ణప్రసాద్, చంద్రబాబు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు తేటతెల్లమవు తుంటే ఇక ఇది ఏ రకంగా పారదర్శకం? ఇది సబబేనా? పెన్షన్లు, ఇళ్ల విషయంలో ఒకటో అరో అవినీతి జరిగితే కట్ చేయాలంటాడు చంద్రబాబు. మరి ఆయనే దగ్గరుండి చేస్తున్న అవినీతిని ఎవరు కట్ చేస్తారు?’ అని అప్పట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
‘పరిపాలన’కు విశాఖ ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దసరా వచ్చిందయ్యా.. పరిపాలన రాజధాని తెచ్చిందయ్యా అంటూ విశాఖ నగరం అందంగా ముస్తాబవుతోంది! వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికారులకు నివాస భవనాలను సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. హిల్–3లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాలను అధికారులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అక్టోబరు చివరినాటికి నిర్మాణం పూర్తయ్యే పలు భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. తుది దశ భవనాల వివరాల సేకరణ విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాల విస్తీర్ణం సుమారు 40 వేల చదరపు అడుగుల మేర ఉంటుందని లెక్కగట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ ప్రైవేట్ భవనాలను కూడా గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధానంగా రానున్న రెండు నెలల్లోగా పూర్తయ్యే భవనాలపై దృష్టి సారించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు స్థానిక సచివాలయాల ద్వారా ఈ వివరాలను సేకరిస్తున్నారు. వీటి విస్తీర్ణం ఎంత మేర ఉంటుందనే వివరాలు ఈ నెలాఖరు నాటికి సిద్ధమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలు అందుబాటులోకి వచి్చన తర్వాత వాటిని లీజుకు తీసుకుని ఏయే విభాగాలను ఏర్పాటు చేయవచ్చనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న అదనపు విస్తీర్ణం ఎంత? అక్కడ ఏ విభాగాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది? అనే వివరాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. -
ఫుట్‌బాల్‌కు అత్యంత ఆదరణ కల్పిస్తాం..!
అనంతపురం: రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు అత్యంత ఆదరణ కల్పిస్తామని ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అనంతపురం నగర శివారులోని అనంత క్రీడా గ్రామం (ఆర్డీటీ స్టేడియం)లో మంగళవారం ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్–2023 పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మన గ్రామీణ ప్రాంతాలకు సరిపోయే క్రీడ ఫుట్‌బాల్ అని, ఇందులో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకనుంచి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకమైన క్రీడగా ఉండాలని భావిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఫైనల్‌కు చేరితే మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌దరెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎం.గౌతమి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ, శాప్ బోర్డు డైరెక్టర్ డానియల్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్, సిక్కిం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రాగా ముగిసింది. -
ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు ఏపీ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ పి.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జాతీయ సేవా పథకం కింద వివిధ సేవలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2021–22గానూ కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పురస్కారాలను ప్రకటించిందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి వర్సిటీ పరిధిలోని జగన్స్ డిగ్రీ–పీజీ కళాశాలకు చెందిన పెళ్లకూరు సాత్విక, అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీకి చెందిన కురుబ జయమారుతి ఉత్తమ వలంటీర్లుగా ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఇద్దరు వలంటీర్లకు రూ.లక్ష నగదు, మెడల్, సర్టిఫికెట్తో కూడిన పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు. -
చంద్రబాబు ఆలయాలు కూలిస్తే... జగన్ నిర్మిస్తున్నారు
సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ పెట్టి 31మంది మృతికి కారకుడైన చంద్రబాబు... కృష్ణా పుష్కరాల సమయంలో అత్యంత దారుణంగా విజయవాడలో 23 ఆలయాలను కూల్చివేశారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు ఆలయాలను కూల్చితే... సీఎం పునర్ నిర్మిస్తున్నారని, త్వరలోనే విజయవాడలో కొత్త ఆలయాలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ‘దేవాలయాల అభివృద్ధి–ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు’పై శాసన మండలిలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు ప్రస్తావించిన పలు అంశాలతోపాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. హిందూ ధర్మం ఒక మతం కాదని, మన జీవనశైలి అని అన్నారు. సనాతన సంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించాలనే మహోన్నత ఆశయంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవదాయశాఖ పరిధిలో ఉన్న 23,001 దేవాలయాలు, 1,742 ధార్మిక సంస్థలు, 133 మఠాల పవిత్రతను కాపాడేందుకు, ఆస్తులను పరిరక్షించేందుకు సీఎం జగన్ విప్లవాత్మక చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 32 ప్రముఖ ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు సౌకర్యాల కోసం అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల కాలనీల్లో రూ.296.20కోట్లతో 2,962 నూతన ఆలయాలను రెండు దశల్లో నిర్మిస్తున్నట్లు వివరించారు. టీటీడీలో 6,700 మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పటికే 3,518 మందికి రూ.313కోట్లతో ఇళ్ల పట్టాలను సీఎం జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశామన్నారు. తిరుమలలో సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కును పునరుద్ధరించామన్నారు. టీడీపీ హయాంలో దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఏకంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని తెలిపారు. కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరలను సైతం మాయం చేశారని పేర్కొన్నారు. దేవదాయ భూముల పరిరక్షణకు పెద్దపీట ‘‘ఒక్కసారి దేవదాయ భూమిగా ప్రకటించిన తర్వాత వాటిని విక్రయించే అవకాశం ఉండదు, రాష్ట్రంలోని దేవదాయ భూముల రక్షణ కోసం 1987లో సెక్షన్–83ని సవరిస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ అమల్లోకి తీసుకొచ్చాం. దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే ప్రవేశపెడుతున్నాం. కొత్తగా గుర్తిస్తున్న దేవదాయ భూములను ఎప్పటికప్పుడు నిషేధిత జాబితాలో చేరుస్తున్నాం. తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులకు పూర్తి రక్షణ కల్పించే విధంగా పలు చర్యలు తీసుకున్నాం’’. అని మంత్రి తెలిపారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, సత్యనారాయణరాజు, కల్పలత, పాకలపాటి రఘువర్మ, తోట త్రిమూర్తులు మాట్లాడారు. -
నేడు జగనన్న ఆరోగ్య సురక్ష పైలట్ క్యాంప్‌లు
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సన్నద్ధతలో భాగంగా మంగళవారం ప్రయోగాత్మకంగా పైలట్‌గా హెల్త్ క్యాంప్‌లను వైద్య శాఖ నిర్వహిస్తోంది. జిల్లాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ చొప్పున 26 జిల్లాల్లో హెల్త్ క్యాంప్‌లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో సర్వే చేసి ప్రజల ఆరోగ్యంపై వాకబు చేసి సమస్యలను గుర్తిస్తున్నారు. సర్వేలో గుర్తించిన వివిధ సమస్యల బాధితులతో పాటు, వైద్య అవసరాలున్న వారికి ఈ నెల 30వ తేదీ నుంచి 45 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి సేవలు అందిస్తారు. ఈ నేపథ్యంలో 30వ తేదీన ప్రారంభించాల్సిన హెల్త్ క్యాంప్‌లపై ముందే పైలట్ క్యాంప్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన విలేజ్ క్లినిక్‌ల పరిధిలో క్యాంప్‌లు పెడతారు. ప్రతి క్యాంప్‌లో ఇద్దరు పీహెచ్‌సీలు వైద్యులు, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు ఉంటారు. క్యాంపుల్లో అవసరమైన చికిత్సలు, మందులు సమకూర్చుకోవడానికి పైలట్ కార్యక్రమం ఉపయోగపడనుంది. ప్రతి క్యాంప్‌లో 162 రకాల మందులు, 18 సర్జికల్ పరికరాలు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్స్ ఉంటాయి. నేటి నుంచి వలంటీర్ల సర్వే.. ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. కాగా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలి్పంచడం కోసం వలంటీర్, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు ఇంటింటి సందర్శన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు సర్వే రూపంలో రెండు దశల ప్రక్రియ ప్రారంభించారు. గ్రామం, పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి మూడు రోజుల ముందు క్యాంప్ నిర్వహించే ప్రాంతం, సమయం ఇతర వివరాలను ప్రజలకు తెలియజేయడం కోసం మూడో దశలో వలంటీర్లు ఇంటింటి సందర్శన చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా తొలి క్యాంప్‌లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు, పట్టణాల్లో మంగళవారం నుంచి వలంటీర్లు గృహాలను సందర్శించి క్యాంప్‌లపై ప్రజలకు మరోమారు అవగాహన కల్పించనున్నారు. అన్ని ఏర్పాట్లు చేశాం! ఆరోగ్య సురక్ష పైలట్ క్యాంప్‌ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మందులు, ఇతర వనరులను సమకూర్చాం. 30వ తేదీ నుంచి ప్రారంభించే క్యాంప్‌లను ప్రతిబింబించేలా పైలట్ క్యాంప్‌లు నిర్వహణ ఉంటుంది. నలుగురు వైద్యులు, సిబ్బంది క్యాంప్‌లలో ఉంటారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరం ఉంటే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు రిఫర్ చేస్తారు. వైద్య పరీక్షలు అవసరం ఉంటే పీహెచ్‌సీలకు మ్యాప్ చేస్తారు. ఇలా రిఫర్, మ్యాపింగ్ చేసిన వారు అనంతరం ఆస్పత్రులకు వెళ్లారా? లేదా? పరీక్షలు చేయించుకున్నారా? లేదా? అన్న దానిపై ఫాలో అప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పైలట్ క్యాంప్‌లు నిర్వహించే గ్రామాల్లో ప్రజలకు ఇప్పటికే వైద్య సిబ్బంది సమాచారం అందజేశారు. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది.