కొత్త సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే కూర్చొని చూసే ఛాన్స్ 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్' రీసెంట్ గానే ప్రారంభించింది. ఈ విషయాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి ఇదివరకే చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 3వ అంతస్తులోని ఫైబర్ నెట్ కార్యాలయంలో 'లవ్ యూ టూ' చిత్ర బృందంతో కలిసి గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. మరో పలు ఆసక్తికర వ‍్యాఖ్యలు చేశారు.
'సినిమా నిర్మాతకు, ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా ఇప్పటికే 'నిరీక్షణ' అనే చిత్రాన్ని రూ.99కి విడుదల చేశాం. రెండో సినిమాగా 'లవ్ యూ టూ' చిత్రాన్ని కేవలం రూ.39కే జూన్ 16 నుంచి ఏపీఎస్ఎఫ్‌ఎల్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమాను ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా చూసే ఛాన్స్ కల్పిస్తాం. త్వరలో మూరుమూల ప్రాంతాలకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు విస్తరిస్తాం. ఏపీఎస్ఎఫ్ఎల్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్, థియేటర్లకు పోటీ కాదు' అని గౌతంరెడ్డి చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల‍్లోకి 31 సినిమాలు.. లిస్ట్ ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment