'రోటీ కపడా..’ పోస్టర్
హర్షా నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఫస్ట్ డోస్ అంటూ ఈ సినిమా పబ్లిసిటీ వీడియోను శనివారం విడుదల చేశారు మేకర్స్. ‘‘నలుగురు స్నేహితుల కథే ఈ చిత్రం. వారి స్నేహం, ప్రేమ, వారి లైఫ్ జర్నీ ఈ సినిమాలో ఉంటుంది. యూత్‌కు ఈ సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్–ఆర్‌ఆర్ ధ్రువన్–వసంత్ .జి, కెమెరా: సంతోష్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment