ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అందరికీ సాధ్యపడదు. అంతదాకా ఎందుకు థియేటర్‌లో సినిమా చూడటం కూడా చాలామందికి సాధ్యం కాని అంశమే! పల్లెటూర్లలో ఉన్నవాళ్లు, మారుమూల గ్రామాల్లో నివసించేవారికి థియేటర్ అందుబాటులో ఉండదు. దీంతో వారు సినిమాలు రిలీజైన వెంటనే చూడలేరు. ఓటీటీలకు వచ్చేదాకా ఆగాల్సిందే! అయితే వారికి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఏపీఎస్‌ఎఫెల్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడేకంగా సినిమాలను డైరెక్ట్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్, నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చింది. సినిమా వాళ్లంటే ఆయనకు ఎంతో అభిమానం. అందుకే సినిమావాళ్లకు ఏడెనిమిది పోస్టులు ఇచ్చారు. ఫైబర్‌నెట్ ద్వారా సినిమా రిలీజ్ అనేది కూడా ఒక సంక్షేమమే! ఈ అవకాశం చిన్న నిర్మాతలకు గొప్ప వరం' అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'చిన్న నిర్మాతలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న గొప్ప అవకాశమిది. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమాలు చేస్తున్నారు. రేపు ఫైబర్ నెట్ కోసం సినిమాలు తీస్తారు. ఏపీ ఫైబర్‌నెట్ పెద్ద రేంజ్‌కు వెళ్లడానికి మేము సహకరిస్తాం' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment