
సాక్షి, విజయవాడ : గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో యథేచ్ఛగా అక్రమాలు జరిగాయి. కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment