సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో క్వాష్ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేర్వేరు పిటిషన్లు వేశారాయన. ఈ క్రమంలో ఇవాళ రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వినిపించారు.
‘‘ఐదేళ్ల కిందట జరిగిన నేరానికి కూడా ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం కాదు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టం ఆధారంగానే విచారణ జరగాలి. కొన్ని చట్టాలను సవరించిన ఆ చట్టంలోని మిగిలిన భాగం అలాగే కొనసాగుతుంది. 17ఏ చట్టం తర్వాత జరిగిన కేసులకే వర్తిస్తుందని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవినీతి అనేది ఎప్పుడు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు.
17ఏ చట్టంం ప్రాథమిక విచారణకే వ్యతిరేకం అయినప్పుడు.. కేసులు ఎలా విచారిస్తారు. 17ఏ విషయంపై నాలుగు హైకోర్టులు చెప్పిన తీర్పులు చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. నేరం జరిగిన సమయానికి 17ఏ లేదు కాబట్టి.. ఇది బాబుకి వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు..
ఇది అవినీతికి సంబంధించిన చట్టం. అవినీతి పరుల్ని కాపాడే చట్టం కాదు. చంద్రబాబు కేసు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు కాబట్టి 17ఏ వర్తించదు. గతంలో నేరం జరిగి.. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసినా 17ఏ వర్తించదు. చంద్రబాబుది సాక్ష్యాలు తారుమారు చేయడం.. ప్రజాధనం లూటీ చేసిన కేసు. అరెస్ట్ చేసిన వెంటనే సెక్షన్ 482 కింద క్వాష్ అడగడం ఎంత వరకు కరెక్టో కోర్టు నిర్ణయించాలి. పోలీసులకు కనీసం విచారణ చేసే అవకాశం ఇవ్వకుండా క్వాష్ కోరడం ఎంత వరకు సబబు. స్కిల్ స్కాం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉంది. ఈ సమయంలో చంద్రబాబు క్వాష్ సరికాదు. 17ఏ చట్టం రాకముందు జరిగిన నేరాలకు.. 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టులు తీర్పు ఇచ్చాయి.
17ఏ వర్తిస్తుందని ఏమైనా తీర్పులున్నాయా? అని ప్రశ్నించిన బెంచ్
అలా తీర్పులు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు.. రోహత్గీ
17ఏ వర్తిస్తుందని తీర్పులు ఉన్నాయి.. చంద్రబాబు తరపు న్యాయవాది లాయర్ లూథ్రా
రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ‘‘కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. విచారణను అడ్డుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి నిర్ణయాలతో సంబంధం లేకుంటే.. 17ఏ ఎలా వర్తిస్తుంది?. 17ఏ అనేది కేవలం అధికార బాధ్యతలకు సంబంధించిన సెక్షన్. నేనే ఈ నిర్ణయాలకు బాధ్యుడిని అని చంద్రబాబు అంటేనే సెక్షన్ 17ఏ వర్తిస్తుంది. ఈ కేసులో 2018 జూన్ 5వ తేదీన జీఎస్టీ డీజీ రాసిన లేఖ చాలా కీలకం. విచారణ 2018లోనే ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది తిరుగులేని సాక్ష్యం. జీఎస్టీ డీజీ రాసిన లేఖపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. జీఎస్టీ రాసిన సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి జరుగుతోందని.. 2017లోనే ఒక విజిల్ బ్లోయర్ లేఖ రాశారు.
విజిల్ బ్లోయర్ పేరు చెప్పకుండా ఉండే చట్టం.. ఇంకా అమల్లో ఉందా? అని రోహత్గీని అడిగిన సుప్రీం కోర్టు
విజిల్ బ్లోయర్‌తన గుర్తింపును చెప్పకుండా ఉండే హక్కు ఉంది: రోహత్గీ
..14మే 2017లో మరోసారి విజిల్ బ్లోయర్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి జరుగుతోందని పుణే జీఎస్టీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రత్యేక చట్టానికి సవరణ 6ఏను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసింది. విచారణ సంస్థలను విచారణ నుంచి అడ్డుకునేందుకు సవరణ చేయలేదు’’ అని రోహత్గీ వాదించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన వాదనల అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది ధర్మాసనం.
చంద్రబాబుని అరెస్ట్ చేస్తారేమో?
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే.. పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబుని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చాల్సి ఉందని, ఆ రోజు హాజరుపరిస్తే గనుక ఈ కేసులో అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్ లూథ్రా విచారణ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజు హాజరుపరిస్తే అరెస్టు చేస్తారని, అప్పుడు ఈ పిటిషన్ నిరర్థకం అవుతుందని లూథ్రా ధర్మాసనానికి వివరించారు. ఆ దశలో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుని.. ‘‘సోమవారం అరెస్టు ఉండద’’ని సీఐడీ తరఫున హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment