బాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌: ఏప్రిల్‌ 16న పూర్తి విచారణ | Chandrababu Bail Cancellation Petition Adjourned In Supreme Court | Sakshi
Sakshi News home page

బాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌: ఏప్రిల్‌ 16న పూర్తి విచారణ

Published Tue, Mar 19 2024 1:19 PM | Last Updated on Tue, Mar 19 2024 1:29 PM

Chandrababu Bail Cancellation Petition Adjourned In Supreme Court - Sakshi

సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్‌ 16న ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. 

కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్‌ రద్దుపై ఏప్రిల్‌ 16న పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement