సాక్షి, ఢిల్లీ: బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ కృష్ణంరాజు దర్యాప్తుపై స్టేను ఎత్తేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. బ్యాంకులకు రుణం ఎగవేత కేసుపై దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ కోరింది. ఇందులో భాగంగా క్రిమినల్, సివిల్ కేసులపై దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
కాగా, రఘురామ కృష్ణంరాజు బ్యాంకులకు మోసం చేసిన కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సంద్భంగా సీబీఐ తన వాదనలు వినిపించింది. ఈ క్రమంలో రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నాన్ మిసిలేనియస్ రోజుల్లో విచారణ జరిపాలని కోరారు. దీంతో, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది జస్టిస్ బీఆర్. గవాయి, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.
అయితే, రఘురామ కృష్ణంరాజు థర్మల్ పవర్ కంపెనీ స్థాపిస్తామని బ్యాంకుల నుంచి రూ.974 కోట్లు రుణం తీసుకున్నారు. ఇన్డ్-భారత్ కంపెనీ పేరుతో రఘురామ పెత్తనం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కంపెనీ కోసం నిధులు ఖర్చు చేయకుండా ఆ డబ్బును ఇతర బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రఘురామ మళ్లీ రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని దారి మళ్లించడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment