
నేటి విజయమ్మ ధర్నా వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్ద శుక్రవారం తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. కృష్ణా నదీ జలాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అరుుతే ఈ కార్యక్రమం వారుుదా పడినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.