
సాక్షి, హైదరాబాద్ : శ్రీచైతన్య కళాశాలలో పుడ్ పాయిజన్ జరిగి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. కొండాపూర్‌లో ఉన్న శ్రీచైతన్య కళాశాలలో వంట చేసి అక్కడ నుంచి మాదాపూర్‌లో ఉన్న హాస్టల్‌కు తరలిస్తుంటారు. మంగళవారం రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకొని వెళ్తున్నారు. కాగా పుడ్ పాయిజన్ విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చుతుంది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులతో ఇంటికి పంపిస్తున్నారు. పుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న హాస్టల్‌లోని మిగతా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment