
గచ్చిబౌలి(హైదరాబాద్): పబ్‌లలో బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాల్సిన బౌన్సర్లే సహనం కోల్లోయి విచక్షణ రహితంగా దాడులుకు తెగబడుతున్నారు. వివరాలివీ... కూకట్‌పల్లి లోధా టవర్స్‌లో నివాసం ఉండే సంజీవ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు కొండాపూర్‌లోని కోమా పబ్‌కు వెళ్లారు. రాత్రి 1.30 సమయంలో టైం ముగిసిందని బయటకు వెళ్లాలని ఓ బౌన్సర్ సూచించారు. 5 నిమిషాల్లో వెళతానని చెప్పిన కొద్ది సేపటికే మరో బౌన్సర్ వచ్చి బయటకు వెళ్లాలని గద్దించాడు.
బాధితుడు సంజీవ
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తరువాత పబ్ నుంచి బయటకు వెళ్లగా బౌన్సర్‌లు వెంబడించారు. బౌన్సర్‌లు పట్టుకోగా మరో వ్యక్తి ముఖంపై పిడి గుద్దులు కురించాడు. దీంతో సంజీవ ముఖంపై తీవ్ర రక్త స్రావం జరిగింది. శనివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బౌన్సర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుఖేందర్ రెడ్డి తెలిపారు. బయటకు వెళుతుండగా పార్కింగ్ వద్ద నలుగురు బౌన్సర్లు నన్ను పట్టుకోగా ఓ వ్యక్తి ముఖంపై దాడి చేశాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment