bouncers attacked
-
కొండాపూర్ పబ్‌లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్‌పై పిడిగుద్దులు
గచ్చిబౌలి(హైదరాబాద్): పబ్‌లలో బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాల్సిన బౌన్సర్లే సహనం కోల్లోయి విచక్షణ రహితంగా దాడులుకు తెగబడుతున్నారు. వివరాలివీ... కూకట్పల్లి లోధా టవర్స్‌లో నివాసం ఉండే సంజీవ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు కొండాపూర్‌లోని కోమా పబ్‌కు వెళ్లారు. రాత్రి 1.30 సమయంలో టైం ముగిసిందని బయటకు వెళ్లాలని ఓ బౌన్సర్ సూచించారు. 5 నిమిషాల్లో వెళతానని చెప్పిన కొద్ది సేపటికే మరో బౌన్సర్ వచ్చి బయటకు వెళ్లాలని గద్దించాడు. బాధితుడు సంజీవ దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తరువాత పబ్ నుంచి బయటకు వెళ్లగా బౌన్సర్లు వెంబడించారు. బౌన్సర్లు పట్టుకోగా మరో వ్యక్తి ముఖంపై పిడి గుద్దులు కురించాడు. దీంతో సంజీవ ముఖంపై తీవ్ర రక్త స్రావం జరిగింది. శనివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బౌన్సర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుఖేందర్ రెడ్డి తెలిపారు. బయటకు వెళుతుండగా పార్కింగ్ వద్ద నలుగురు బౌన్సర్లు నన్ను పట్టుకోగా ఓ వ్యక్తి ముఖంపై దాడి చేశాడన్నారు. -
బౌన్సర్లు బాదేశారు..
బంజారాహిల్స్: బాత్రూంలో న్యాప్కిన్ తొలగించలేదన్న నెపంతో 15 మంది బౌన్సర్లు పబ్‌కు వచ్చిన తొమ్మిది మంది యువకులపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంపాపేట్‌కు చెందిన భరత్‌రెడ్డి రెండు వారాల క్రితం అమెరికా నుంచి నగరానికి వచ్చాడు. మరో వారం రోజుల్లో కెనడాకు వెళ్లనున్న అతను తన పుట్టిన రోజులు సందర్భంగా ఆదివారం రాత్రి స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకుగాను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ఆమ్నేషియా లాంజ్ పబ్‌కు వచ్చాడు. భరత్‌తోపాటు అతడి స్నేహితులు కార్తీక్ రెడ్డి, హితేష్, ప్రణీత్, నవీన్, అనిరుద్, అవినాష్, కేశవ్, గౌరవ్ తదితరులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విందు వినోదాల్లో మునిగితేలారు. విందు ముగిసిన అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధపడిన వారు కిందికి వస్తున్నారు. అదే సమయంలో రూ.60వేల బిల్లు రావడంతో అక్కడే ఉన్న కార్తీక్‌రెడ్డిని బిల్లు ఎవరు చెల్లిస్తారంటూ బౌన్సర్లు ప్రశ్నించగా, తన స్నేహితుడు చెల్లించాడు కదా అని చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బౌన్సర్లు అసభ్యంగా దూషిస్తూ పీకల దాకా తాగి జారుకుంటారా అంటూ అవమానించడమేగాక బాత్రూమ్లో ఇష్టం వచ్చినట్లు న్యాప్కిన్లు పడేశారని వాటిని ఎవరు తొలగిస్తారంటూ నిలదీశారు. దీంతో బౌన్సర్లకు, యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన బౌన్సర్లు కార్తీక్‌పై చేయిచేసుకోవడమేగాక అడ్డువచ్చిన నవీన్‌ను కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడిగిన అనిరుధ్‌పై దాడికి దిగారు. అనంతరం హితేష్ లిఫ్ట్ లోకి తీసుకెళ్లి కొట్టుకుంటూ కిందికి తీసుకొచ్చారు. 15 మంది బౌన్సర్లు దాదాపు 2 గంటల పాటు వారిని చితకబాదారు. పబ్ మేనేజర్లు ముర్తుజాభాను, మహేశ్‌యాదవ్ చోద్యం చూస్తూ బౌన్సర్లను రెచ్చగొట్ట డంతో రూపేష్, శ్రవణ్, కరీం, ఇర్ఫాన్ అనే బౌన్సర్లు మరింత రెచ్చిపోయి కార్తీక్ తలపై లాఠీతో బాదడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు వారిపై మరోసారి దాడి చేశారు. అసభ్యంగా దూషించడమేగాక మీ అంతు చూస్తామని బెదిరించారు. పోలీసులకు చెప్పినా ఏమీ చేయలేరని, పోలీసులు మా వాళ్లేనని చెబుతూ, మరోసారి జూబ్లీహిల్స్‌కు వస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు లోనైన కార్తీక్, భరత్, నవీన్, హితేష్, తదితరులు 2 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు బౌన్సర్లు రూపేష్, శ్రవణ్, కరీంలతో పాటు మేనేజర్లు, పబ్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు బౌన్సర్లను అరెస్ట్ చేయగా, ఇర్ఫాన్ పరారీలో ఉన్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడిపై బౌన్సర్ల దాడి
రాంగోపాల్‌పేట్: హారన్ కొట్టినందుకు ఓ యువకుడిపై ప్యారడైజ్ హోటల్ బౌన్సర్లు దాడి చేసి చితకబాదడమేగాక, అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై చేయిచేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన షణ్ముఖం ఓ ప్రైవేటు సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను ప్యారడైజ్ సర్కిల్ నుంచి హెచ్డీఎఫ్సీ వైపు బైక్‌పై వెళుతున్నాడు. ప్యాడరైజ్ హోటల్ సెల్లార్ నుంచి కార్లు బయటికి వస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయియి. దీంతో షణ్ముఖం హారన్ కొట్టి వాహనం పక్కకు తీయాలని కోరాడు. దీంతో అక్కడే ఉన్న హోటల్ బౌన్సర్ సునీల్ అతడిపై దాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన మరో బౌన్సర్ అక్కడికి వచ్చి షణ్ముఖంను కిందపడేసి కొట్టారు. స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేశారు. దీంతో కొందరు యువకులు సునిల్ పట్టుకుని 100కు డయల్ చేశారు. రాంగోపాల్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునిల్‌ను అదుపులోకి తీసుకోగా మరో బౌన్సర్ పారిపోయాడు. హోటల్ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేయడం లేదని సమాచారం. ఈ విషయమై వివరణ కోరగా బాధితుడు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
వైరల్ : పార్క్‌లో కుటుంబంపై బౌన్సర్ల వీరంగం
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సోమవారం సరదాగా కాన్పూర్‌లోని బ్లూ వరల్డ్ థీమ్ వాటర్ పార్క్‌కు వెళ్లిన ఓ కుటుంబంపై బౌన్సర్లు విరుచుకుపడ్డారు. పార్క్‌లో అనుమతి లేకుండా రైడ్ చేశారని ఆరోపిస్తూ బౌన్సర్లు ఆ కుటుంబంతో వాగ్యూద్ధానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. బౌన్సర్లు ఆ కుటుంబ సభ్యులను కిందపడేసి మరి పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆ కుటుంబానికి చెందిన మహిళ జుట్టు పట్టి లాగుతూ అమానుశంగా దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వారు ఏం చర్చించారో స్పష్టంగా లేకపోయినప్పటికీ.. వారి మధ్య అసభ్యకరమైన దూషణలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పార్క్‌లో ఓ కుటుంబంపై బౌన్సర్లు దాడి
-
కలకలం; ఐటీ ఉద్యోగుల గెంటివేత
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ ఐటీ కారిడార్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాకం హైదరాబాద్‌లో కలకలం రేపింది. 200 మంది ఉద్యోగులను బలవంతంగా తొలగించడం ఆందోళన రేకెత్తించింది. తమను భయపెట్టి బలవంతంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేయించిందంటూ వెరిజాన్ డాటా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(వీడీఎస్) కంపెనీపై పలువురు ఉద్యోగులు ఈ నెల 4న పోలీసులను ఆశ్రయించారు. బౌన్సర్లతో భయపెట్టి.. కంపెనీ యాజమాన్యం 2017 డిసెంబర్ 12, 13 తేదీల్లో మీటింగ్ రూమ్‌కు ఒక్కొక్కరిని పిలిపించి తాము ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు సంతకాలు చేయాలని ప్రింటెడ్ పేపర్లు తమ ముందు ఉంచిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉద్యోగులు వాపోయారు. అప్పటికే ఆ గదిలో బౌన్సర్లతో హెచ్ఆర్ మేనేజర్ కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు కొంత సమయం కావాలని తాము అడగగా హెచ్ఆర్ మేనేజ్మెంట్ నిరాకరించిందని, రాజీనామా పత్రాలపై సంతకం పెట్టడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెబుతూ బౌన్సర్లకు సైగలు చేసిందని ఆరోపించారు. తమలో కొందరు సీట్లలోంచి లేచి బయటకు రాబోగా బౌన్సర్లు తమను కదలనీయకుండా అదిమిపెట్టారన్నారు. తమను మానసికంగా, భౌతికంగా హింసించి రాజీనామా పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, తమంతగా తాము రాజీనామాలు చేయలేదని వివరించారు. అనంతరం బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది తమను కార్యాలయం నుంచి బయటకు గెంటేశారని, కనీసం తమ సొంత వస్తువులు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బౌన్సర్ల, సెక్యూరిటీ సిబ్బంది దురుసు చర్యలు ఆ భవనంలోని, చుట్టుపక్కల భవనాల్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉన్నాయన్నారు. కంపెనీ యాజమాన్యం వాటిని ధ్వంసం చేయకముందే స్వాధీనం చేసుకుని పరిశీలించాల్సిందిగా పోలీసులను బాధితులు కోరారు. తమ ఫిర్యాదును పరిశీలించి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, చెన్నై కార్యాలయంలోనూ పలువురు ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, చెన్నైలో మొత్తం 1250 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు గత డిసెంబర్లోనే వార్తలు వచ్చాయి. దీనిపై వెరిజాన్ డాటా కంపెనీ స్పందించలేదు. ఉద్వాసనలు- ఆందోళనలు ఐటీ రంగంలో ఉద్యోగుల ఉద్వాసనలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేషన్, అప్డేట్ కాకపోవడం వంటి కారణాలు చూపుతూ ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. సీనియర్ ఉద్యోగులను తీసేసి వీరి స్థానంలో తక్కువ వేతనాలకు కొత్తగా సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు. ఐటీ ఉద్యోగుల హక్కులు కాపాడేందుకు ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్(ఫైట్) కూడా పనిచేస్తోంది. గతేడాది కాగ్నిజెంట్‌లో ఉద్యోగులను తొలగించినప్పుడు ‘ఫైట్’ గట్టిగా పోరాడింది. -
మంత్రి డ్రైవర్‌పై సెక్యూరిటీ దాడి
-
మంత్రి డ్రైవర్‌పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు డ్రైవర్ నాగరాజుపై ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది దాడిచేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మోహన్‌బాబు ఇంటిముందు ఈ ఘటన జరిగింది. మోహన్ బాబు ఇంటి ముందు డ్రైవర్ నాగరాజు నిలబడ్డాడని నలుగురు బౌన్సర్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. నాగరాజు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు మోహన్‌బాబు ఇంటికి చేరుకుని దాడి చేసిన నలుగురు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.