యువకుడిపై బౌన్సర్ల దాడి | Paradise Hotel Bouncers Attack on Youngman in Hyderabad | Sakshi

యువకుడిపై బౌన్సర్ల దాడి

Published Sat, May 11 2019 7:32 AM | Last Updated on Sat, May 11 2019 7:32 AM

Paradise Hotel Bouncers Attack on Youngman in Hyderabad - Sakshi

దాడికి పాల్పడిన బౌన్సర్లు

రాంగోపాల్‌పేట్‌: హారన్‌ కొట్టినందుకు ఓ యువకుడిపై ప్యారడైజ్‌ హోటల్‌ బౌన్సర్లు దాడి చేసి చితకబాదడమేగాక, అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై చేయిచేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన షణ్ముఖం ఓ ప్రైవేటు సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను ప్యారడైజ్‌ సర్కిల్‌ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ వైపు బైక్‌పై వెళుతున్నాడు. ప్యాడరైజ్‌ హోటల్‌ సెల్లార్‌ నుంచి కార్లు బయటికి వస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయియి.

దీంతో షణ్ముఖం హారన్‌ కొట్టి వాహనం పక్కకు తీయాలని కోరాడు. దీంతో అక్కడే ఉన్న హోటల్‌ బౌన్సర్‌ సునీల్‌ అతడిపై దాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన మరో బౌన్సర్‌ అక్కడికి వచ్చి షణ్ముఖంను కిందపడేసి కొట్టారు. స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై  దాడి చేశారు. దీంతో కొందరు యువకులు సునిల్‌ పట్టుకుని 100కు డయల్‌ చేశారు. రాంగోపాల్‌పేట్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునిల్‌ను అదుపులోకి తీసుకోగా మరో బౌన్సర్‌ పారిపోయాడు. హోటల్‌ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేయడం లేదని సమాచారం. ఈ విషయమై వివరణ కోరగా బాధితుడు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement