paradise hotel
-
డీమార్ట్, ప్యారడైజ్‌కు భారీ జరిమానా
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ లోని డీమార్ట్ షాపింగ్ మాల్, ప్యారడైజ్ రెస్టారెంట్లకు ఊహించని షాక్ తగిలింది. వినియోగ దారుల నుంచి క్యారీ బ్యాగుల కోసం ఆదనంగా చార్జీలు వసూలు చేస్తున్నందుకు తాజాగా వినియోగదారుల పోరమ్ జరిమానా విధించింది. హైదర్‌గూడ డీమార్ట్ బ్రాంచ్‌కు, సికింద్రాబాద్, బేగంపేట ప్యారడైజ్ రెస్టారెంట్లకు వినియోగదారుల ఫోరమ్ కోర్టు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ. 4 వేల నష్ట పరిహారం, కోర్టు ఖర్చులు చెల్లించాలని వినియోగదారుల పోరమ్ తీర్పు చెప్పింది. కాగా, విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019లో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయగా క్యారీ బ్యాగ్స్ కోసం రూ.4.76 చార్జ్ చేశారు. 2019 జూన్‌లో హైదరాగూడ డీమార్ట్ నుంచి సామాగ్రి కోనుగొలు చేయగా అక్కడ కూడా క్యారీ బ్యాగ్ కోసం రూ. 3.75 వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో కమిషన్ తాజా తీర్పునిచ్చింది. చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం -
యువకుడిపై బౌన్సర్ల దాడి
రాంగోపాల్‌పేట్: హారన్ కొట్టినందుకు ఓ యువకుడిపై ప్యారడైజ్ హోటల్ బౌన్సర్లు దాడి చేసి చితకబాదడమేగాక, అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై చేయిచేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన షణ్ముఖం ఓ ప్రైవేటు సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను ప్యారడైజ్ సర్కిల్ నుంచి హెచ్డీఎఫ్సీ వైపు బైక్‌పై వెళుతున్నాడు. ప్యాడరైజ్ హోటల్ సెల్లార్ నుంచి కార్లు బయటికి వస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయియి. దీంతో షణ్ముఖం హారన్ కొట్టి వాహనం పక్కకు తీయాలని కోరాడు. దీంతో అక్కడే ఉన్న హోటల్ బౌన్సర్ సునీల్ అతడిపై దాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన మరో బౌన్సర్ అక్కడికి వచ్చి షణ్ముఖంను కిందపడేసి కొట్టారు. స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేశారు. దీంతో కొందరు యువకులు సునిల్ పట్టుకుని 100కు డయల్ చేశారు. రాంగోపాల్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునిల్‌ను అదుపులోకి తీసుకోగా మరో బౌన్సర్ పారిపోయాడు. హోటల్ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేయడం లేదని సమాచారం. ఈ విషయమై వివరణ కోరగా బాధితుడు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
‘ప్యారడైజ్’ పేరు వాడుకోవడం అక్రమం
కలెక్టరేట్: హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అందులోనూ నగరంలోని ప్యారడైజ్ బిర్యానీ అంటే మరింత క్రేజ్.. ఎన్నో దేశాల అతిథులు ప్యారడైజ్ బిర్యానీని ప్రశంసించారు. అంతటి పేరు ప్రఖ్యాతలుగాంచిన ‘ప్యారడైజ్’ పేరును కొన్ని ఫుడ్ కోర్టులు, బిర్యానీ సెంటర్లు అక్రమంగా వాడుకుంటున్నాయి. తమ సంస్థ పేరు వాడుకోవడంతో పాటు తమ సంస్థకు ఉన్న గుర్తింపును దెబ్బతీసేలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ సంస్థను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ప్యారడైజ్ సంస్థ గతంలో సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ప్యారడైజ్ సంస్థ ప్రతిపాదనలు, అభ్యర్థనలను పరిశీలించిన న్యాయస్థానం ప్యారడైజ్ పేరును వాడుకోవడం అక్రమమని తీర్పు చెప్పడమే కాకుండా ప్యారడైజ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టులు, హోటళ్ల బో ర్డులను తక్షణమే తొలగించాలని గురువారం సం బంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు తీర్పుతో స్పందించిన అధికారులు ప్యారడైజ్ పే రుతో ఉన్న అక్రమ బోర్డులను శుక్రవారం తొల గించారు. సంస్థ పేరుతో ఉపయోగించిన ప్యా కింగ్ పరికరాలు, బాక్సులు, లేబుల్స్‌లను సీజ్ చేశారు. -
శాఖాహారంలో కోడిగుడ్డు.. కస్టమర్‌పై ప్రముఖ హోటల్ దౌర్జన్యం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ హోటల్‌కు వెళ్లి.. ఓ కస్టమర్ వెజిటేరియన్ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చాడు. తీరా.. సర్వర్ తీసుకొచ్చి వడ్డించిన వెజ్ బిర్యానీలో కోడిగుడ్డ దర్శనమివ్వడంతో అతను అవాక్కయ్యాడు. ఇదెక్కడి చోద్యమని హోటల్ నిర్వాహకులను నిలదీశాడు. దీంతో అతన్ని హోటల్ సిబ్బంది బలవంతంగా బయటకు గెంటేశారు. ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న ప్యారడైజ్ హోటల్లో ఈ ఘటన జరిగింది. ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన శాఖాహారంలో కోడి గుడ్డు ప్రత్యక్షం కావడంతో.. ఆయన ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన హోటల్ సిబ్బంది అతనిపై దౌర్జన్యానికి దిగారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించి కస్టమర్‌ను బయటకు గెంటేశారు సిబ్బంది. -
ఆదాబ్..కబాబ్!
రాంగోపాల్‌పేట్: ప్యారడైజ్ హోటల్లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్లో వివిధ రకాల కబాబ్స్ నోరూరిస్తున్నాయి. మంగళవారం సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్యారడైజ్ హోటల్స్ సీఈవో గౌతమ్ గుప్త మాట్లాడుతూ సెప్టెంబర్ 30 వరకూ ఫెస్టివల్ కొనసాగుతుందన్నారు. మటన్, చికెన్, ఫిష్‌తో పాటు వెజిటేరియన్స్ కోసం ప్రత్యేక కబాబ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నగరంలోని ప్యారడైజ్‌కు చెందిన 15 ఔట్లెట్స్లతో పాటు బెంగుళూరులోనూ కబాబ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కల్మీ కబాబ్, చికెన్ టిక్కా, తందూరి చికెన్, రెష్మీ కబాబ్, గార్లిక్ కబాబ్, మటన్ కబాబ్్సలో సోలే, షీక్ కబాబ్, గులాటీ, ఫిష్‌లో ఫిష్ టిక్కా, తందూరి జింగా, కోకో ఫిష్, వెజ్‌లో పన్నీర్ టిక్కా, బూటేకే కబాబ్, చనా, ఆక్రుత్ వంటి విభిన్న రకాల టేస్ట్‌లతో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. -
ప్యారడైజ్ హోటల్ ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు!
హైదరాబాద్: ప్రమాణాలను పాటించలేదనే కారణంతో దేశవ్యాప్త గుర్తింపు ఉన్న ప్యారడైజ్ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. ప్యారడైజ్ హోటల్ లో వినియోగదారుల భద్రతను పట్టించుకోవడలేదనే అంశం తాజా తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం లేదనే కారణంతో హోటల్ ను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. రోజువారి తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ ఆస్పత్రితోపాటు నగరంలోని పలు వ్యాపార సముదాయాలను పరిశీలించారు. -
ప్యారడైజ్ హోటల్లో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్: కాచిగూడలోని సిలిండర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరగక ముందే సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్లోని వంటగదిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కిచెన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు. కాచిగూడలోని సంజయ్‌గాంధీనగర్ బస్తీలో శనివారం రాత్రి అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు.