ప్యారడైజ్ పేరుతో ఉన్న అక్రమ బోర్డును తొలగిస్తున్న అధికారులు
కలెక్టరేట్: హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అందులోనూ నగరంలోని ప్యారడైజ్ బిర్యానీ అంటే మరింత క్రేజ్.. ఎన్నో దేశాల అతిథులు ప్యారడైజ్ బిర్యానీని ప్రశంసించారు. అంతటి పేరు ప్రఖ్యాతలుగాంచిన ‘ప్యారడైజ్’ పేరును కొన్ని ఫుడ్ కోర్టులు, బిర్యానీ సెంటర్లు అక్రమంగా వాడుకుంటున్నాయి. తమ సంస్థ పేరు వాడుకోవడంతో పాటు తమ సంస్థకు ఉన్న గుర్తింపును దెబ్బతీసేలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ సంస్థను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ప్యారడైజ్ సంస్థ గతంలో సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది.
ప్యారడైజ్ సంస్థ ప్రతిపాదనలు, అభ్యర్థనలను పరిశీలించిన న్యాయస్థానం ప్యారడైజ్ పేరును వాడుకోవడం అక్రమమని తీర్పు చెప్పడమే కాకుండా ప్యారడైజ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టులు, హోటళ్ల బో ర్డులను తక్షణమే తొలగించాలని గురువారం సం బంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు తీర్పుతో స్పందించిన అధికారులు ప్యారడైజ్ పే రుతో ఉన్న అక్రమ బోర్డులను శుక్రవారం తొల గించారు. సంస్థ పేరుతో ఉపయోగించిన ప్యా కింగ్ పరికరాలు, బాక్సులు, లేబుల్స్‌లను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment